ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఘనంగా ఎఐఎ ఇండియా ఇండిపెండెన్స్ వేడుకలు 

ఘనంగా ఎఐఎ ఇండియా ఇండిపెండెన్స్ వేడుకలు 

కాలిఫోర్నియాలో అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండో అమెరికన్స్‌ (ఎఐఎ), బాలీ 92.3 ఆధ్వర్యంలో ఇండియా ఇండిపెండెన్స్‌ డే వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన ‘స్వదేశ్‌’ వేడుకలు వైభవంగా జరిగాయి. బే ఏరియాలోని 40 అసోసియేషన్‌లు ఈ వేడుకల్లో పాల్గొని మద్దతును ఇచ్చాయి. భారతీయ సంస్కృతిని, కళలను పరిరక్షించడం, ప్రచారం చేయాలన్న లక్ష్యంతో ఈ వేడుకలను ఎఐఎ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. విజయ్‌ భరత్‌ గ్రాండ్‌ మ్యూజికల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందరినీ ఆకట్టుకుంది.

వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కళాకారులు చేసిన వినోద నృత్య కార్యక్రమాలు, శాస్త్రీయ నృత్యాలు. సినిమా డ్యాన్స్‌లతోపాటు వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన పోటీలలో దాదాపు 400 మంది పిల్లలు పాల్గొన్నారు. ఎఐఎ రాక్‌స్టార్‌ పాటల పోటీ సూపర్‌ హిట్‌ అయింది. క్యారమ్స్‌, చదరంగం, ఫోటోగ్రఫీ, ఆర్ట్‌, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఎఐఎ, ఇబికె గాయకులు ఫుట్‌ ట్యాపింగ్‌ పాటలను అందించారు. ‘జన గణ మన’’ కోరస్‌ గానం, 100 అడుగులకుపైగా ఉన్న భారతీయ జెండా ఈ వేడుకల్లో ముఖ్యమైన అంశాలలో ఒకటిగా నిలిచింది.

శాన్‌ఫ్రాన్సిస్కో కాన్సుల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఓ) డా. టివి నాగేంద్ర ప్రసాద్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇతర ప్రముఖులతో కలిసి ఆయన జెండాను ఆవిష్కరించారు. మేయర్‌ మట్‌ మహాన్‌ (శాన్‌ జోస్‌ నగరం), మేయర్‌ లిల్లీ మెయి (ఫ్రీమాంట్‌ నగరం), మేయర్‌ జెఫ్‌ గీ (రెడ్‌వుడ్‌ సిటీ), మేయర్‌ హంగ్‌ వీ (కుపెర్టినో నగరం), మేయర్‌ లిసా గిల్మోర్‌ (శాంటా క్లారా నగరం), మేయర్‌ కార్మెన్‌ మోంటానో (మిల్పిటాస్‌ నగరం), టామ్‌ పైక్‌ (కాంగ్రెస్‌మెన్‌ రో ఖన్నా కార్యాలయం), తారా శ్రీకృష్ణన్‌ (సెనేటర్‌ డేవ్‌ కోర్టేస్‌), అసెంబ్లీ సభ్యుడు యాష్‌ కల్రా (27వ జిల్లా), అనురాగ్‌ పాల్‌-(అసెంబ్లీ సభ్యుడు అలెక్స్‌ లీ కార్యాలయం), అసెంబ్లీ సభ్యుడు గెయిల్‌ పెల్లెరిన్‌ (28వ జిల్లా), అసిస్టెంట్‌ డిస్ట్రిక్ట్‌ అటార్నీ జేమ్స్‌ గిబ్బన్స్‌-షాపిరో (శాంటా క్లారా), సూపర్‌వైజర్‌ సిండి చావెజ్‌ (శాంటా క్లారా కౌంటీ), సూపర్‌వైజర్‌ ఒట్టో లీ (శాంటా క్లారా కౌంటీ), అజయ్‌ భూటోరియా, ఆసియా పసిఫిక్‌ ఐలాండర్స్‌ కమిషన్‌ సలహాదారు సభ్యుడు, వైస్‌ మేయర్‌ కెవిన్‌ పార్క్‌ (శాంటా క్లారా సిటీ కౌన్సిల్‌), శాన్‌ జోస్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు (లెఫ్టినెంట్‌ ముల్లర్‌, ఆఫ్‌సి. మీర్‌, ఆఫ్‌సి. గిరి మరియు ఇతరులు) కౌన్సిల్‌ సభ్యులు రాజ్‌ సాల్వాన్‌ (సిటీ ఆఫ్‌ ఫ్రీమాంట్‌), రాజ్‌ చాహల్‌ (శాంటా క్లారా సిటీ కౌన్సిల్‌), మురళీ శ్రీనివాసన్‌ (సిటీ ఆఫ్‌ సన్నీవేల్‌), అర్జున్‌ బాత్రా (సిటీ ఆఫ్‌ శాన్‌ జోస్‌), ప్రణితా వెంకటేష్‌ (శాన్‌ కార్లోస్‌ నగరం), డొమింగో కాండెలాస్‌ (సిటీ ఆఫ్‌ శాన్‌ జోస్‌), అనూ నక్కా అండ్‌ క్రిస్‌ నార్వుడ్‌ (మిల్పిటాస్‌ స్కూల్‌ బోర్డ్‌), రైనా లారీ (శాంటా క్లారా బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌) మరియు అనేక ఇతర ఎన్నికైన అధికారులు ఈ వేడుకకు హాజరయ్యారు.

జెండా ఎగురవేసిన అనంతరం సభను ఉద్దేశించి ప్రముఖులు ప్రసంగిస్తూ, 77వ భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభా కాంక్షలు తెలియజేసారు, భారతీయుల దేశభక్తిని చూసి సంతోషిస్తున్నామని, దీన్ని చిరస్మరణీయమైన కార్యక్రమంగా మార్చినందుకు ఎఐఎ బృందాన్ని డా. నాగేంద్ర ప్రసాద్‌ అభినందించారు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుండి ప్రాతినిధ్యం వహించడం మరియు మన వారసత్వం, సంస్కృతిని పరిరక్షించడంలో ఎఐఎ చేస్తున్న కృషిని అభినందించారు. 

సెన్సేషనల్‌ సింగర్‌ విద్యా వోక్స్‌ లైవ్‌ మ్యూజిక్‌ అందరినీ ఆకట్టుకుంది. ఆమె పాటలు ఎంతోమందికి హుషారు కలిగించింది. 

ఈవెంట్‌ను గ్రాండ్‌గా విజయవంతం చేయడంలో కృషి చేసిన వలంటీర్లకు సహకరించిన స్పాన్సర్లకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. సంజీవ్‌ గుప్తా సిపిఎ గ్రాండ్‌ స్పాన్సర్‌గా వ్యవహరించారు. ప్లాటినం స్పాన్సర్‌ గా నాగరాజ్‌ అన్నయ్య, ఐసిఐసిఐ బ్యాంక్‌, ఎన్‌బిసి బే ఏరియా వంటివి ఇతర స్పాన్సర్లుగా ఉన్నాయి. 


List of AIA supporting organizations: 

American Organization for Development of Bihar (AODB)  
Asha Jyothi Organization 
Association of Rajasthan in America (Bay Area) 
Bihar Foundation (USA - California Branch) 
BATA - Bay Area Telugu Association
BATM - Bay Area Tamil Manram 
Bay Malayali, Bihar Association
Brahma Kumaris 
Dance Karishma
East Bay Karaoke
Federation of Malayalee Associations of Americas 
Gujarati Cultural Association (GCA) 
GOPIO (Global Organization of the People of Indian Origin) 
ILP (India Literacy Project) 
Indo American Society of Bay Area 
IACF - Indo-American Community Federation 
KKNC (kannada Koota of Northern California)
KTF Kashmiri Task Force 
MANCA 
NAIR SERVICE SOCIETY
OSA (California Chapter)
Paatasala (Telugu School)
PCA (Punjabi Cultural Association) 
Rotary International 
SRCA (San Ramon Cricket Association) 
SEF (Sankara Eye Foundation) 
Spandana organization 
TANA (Telugu Association of North America) 
TCA (Telangana Cultural Association) 
TDF (Telangana Development Forum) 
United Fiji Association
UPMA (Uttar Pradesh Mandal) 
VEDA Temple 
VPA (Vokkaliga Parishat of America) 
VT Seva

 

Click here for Event Gallery

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :