ASBL NSL Infratech

నాలుగో రోజుకు చేరిన వైయస్సార్సీపీ ఎంపీల ఆమరణదీక్ష

నాలుగో రోజుకు చేరిన వైయస్సార్సీపీ ఎంపీల ఆమరణదీక్ష

ఆస్పత్రిలో కొనసాగుతున్న వైవీ సుబ్బారెడ్డి ఆమరణదీక్ష. ఫ్లూయిడ్స్‌ తీసుకునేందుకు నిరాకరించిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ 4వ రోజుకు చేరిన వైయస్సార్‌సీపీ ఎంపీల ఆమరణ దీక్ష. వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో బలవంతగా ఆస్పత్రికి తరలించిన వైద్యులు

ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైయస్సార్‌సీపీ ఎంపీలు ప్రాణాలను పణంగాపెట్టి... పోరాడుతున్నారు.  సుగర్, బీసీలతో పార్టీ సీనియర్‌ ఎంపీలు మేకపాటి, వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డి బాధపడుతున్నావారు వెనకంజ వేయలేదు. ప్రాణాలకు ప్రమాదమని తెలిసి కూడా వారు ఆమరణదీక్ష చేపట్టారు. మేకపాటిని కుటుంబ సభ్యులు, వైద్యులు వారించినా సరే.. ఆయన 73 ఏళ్ల వయసులో ఆమరణదీక్షకు దిగారు. ఎంపీ వరప్రసాద్‌కూడా 64ఏళ్ల వయసులో సుగర్, బీపీలతో బాధపడుతున్నా.. ఆయన ఆమరణదీక్ష చేశారు. వీరి ఆరోగ్యపరిస్థితి విషమించడంతో వైద్యులు బలవంతంగా ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. సీనియర్‌ ఎంపీ మేకపాటి వాంతులు చేసుకుంటూ.. తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పరిస్థితికూడా విషమించడంతో.. కుటుంబ సభ్యులు, వైద్యులు ఆయన్ని దీక్ష విరమించాల్సిందిగా కోరారు. బలవంతగా ఆస్పత్రికి తరలించారు. అయినా..ఆమరణదీక్షను విరమించడానికి వైవీ నిరాకరించారు. ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కుటుంబ సభ్యులు కోరుతున్నా.. ఎంపీ వైవీ దీక్షవిరమణకు అంగీకరించలేదు. ఎంపీ వైవీ సుగర్‌ 66 పాయింట్లకు పడిపోయింది.

ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి బలవంతంగా ఫ్లూయిడ్స్‌ ఎక్కించిన వైద్యులు

ఆస్పత్రిలో చేరిన తర్వాతకూడా ఆమరణదీక్ష.కొనసాగించిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. శరీరంలో సుగర్‌ లెవల్స్‌ పడిపోవడంతో ఫ్లూయిడ్స్‌ ఎక్కించుకోవాలని కోరిన వైద్యులు 
నిరాకరించిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. తర్వాత బలవంతంగా ఫ్లూయిడ్స్‌ ఎక్కించిన ఆర్‌ఎంఎల్‌హెచ్‌ వైద్యులు.

Click here for Photogallery

 

Tags :