ASBL NSL Infratech

వైయ‌స్సార్‌సీపీ లోక్ సభ ఎంపీలు రాజీనామా

వైయ‌స్సార్‌సీపీ లోక్ సభ ఎంపీలు రాజీనామా

ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన ఉద్యమంలో భాగంగా గత నాలుగేళ్ళుగా నిరంతరం ప్రజల మధ్యనే ఉండి ప్రజా పోరాటం చేస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ పోరాటాన్ని ఢిల్లీ కేంద్రంగా మరింత ఉధృతం చేసింది. గత 13 రోజులుగా అవిశ్వాస తీర్మానాలు ఇచ్చిన వైయస్అర్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎంపీలు ఈరోజు పార్లమెంటు నిరవధికంగా వాయిదా పడటంతో తమ ఎంపీ పదవులకు రాజీనామాలు చేశారు. రాజీనామా లేఖలను స్పీకర్ సుమిత్రా మహాజన్ కు స్పీకర్ ఫార్మాట్లోనే మధ్యాహ్నం 12 గంటల సమయంలో అందజేశారు. ఆతర్వాత ఏపీ భవన్ కు వెళ్ళి ఎంపీలు ఆమరణ దీక్షకు దిగుతారు.

ఆంధ్రప్రదేశ్ కు  ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు సాధన ఉద్యమంలో భాగంగా.. తమ పార్లమెంటు సభ్యత్వాన్ని తృణప్రాయంగా వదులుకొని, రాజీనామాలు సమర్పించి ఢిల్లీ ఏపీ భవన్ లో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యుల నిరసనలకు సంబంధించిన వీడియో ఫీడ్ ఈ కింది లింకు ద్వారా ఇవ్వబడుతుంది.                                                                                                                                                              Satellite Link - frequency Satellite:GSat-18, KU Band down Link Frequency:11674.25, S/R:1.166 Maps, Modulation:DVBS2, 8PSK, FEC:Auto, Pol: Horizontal. Plz provide coverage. 

 

 

Tags :