ASBL NSL Infratech

ప‌శ్చిమ‌ గోదావ‌రి జిల్లా రామారావు గూడెం వ‌ద్ద మీడియాతో వైయ‌స్ జ‌గ‌న్

ప‌శ్చిమ‌ గోదావ‌రి జిల్లా రామారావు గూడెం వ‌ద్ద మీడియాతో వైయ‌స్ జ‌గ‌న్

గోదావ‌రి, కృష్ణా న‌దుల‌పై జ‌రుగుతోన్న ప‌డ‌వ‌, లాంచీల ప్ర‌మాదాలు స‌ర్కారు హ‌త్య‌లే ఈ దుస్సంఘ‌ట‌న‌ల‌కు ముఖ్య‌మంత్రి, మంత్రులు బాధ్య‌త వ‌హించాలి. కేవ‌లం ఆరు నెల‌ల్లో మూడు దుస్సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. నదుల‌పై భ‌ద్ర‌త లేని ప‌డ‌వ‌లు, లాంచీలు య‌థేచ్చ‌గా తిరుగుతున్నాయి. వాటిలో ఏ ఒక్క‌టికీ ఫిట్‌నెస్  లేదు. ముఖ్య‌మంత్రి అధికార నివాసానికి స‌మీపంలో గ‌త న‌వంబ‌రులో కృష్ణా న‌దిలో ప‌డ‌వ ప్ర‌మాదం జ‌రిగింది.ఈఘ‌ట‌న‌లో 21 మంది మ‌ర‌ణించారు. అయిదు రోజుల కింద మ‌రో ప‌డ‌వ గోదావ‌రి న‌దిపై వెళుతోన్న ప‌డ‌వ అగ్ని ప్ర‌మాదానికి లోయ్యింది. అందులోని  40 మంది ప్ర‌యాణీకులు ఆ ప‌డ‌వ నుంచి బ‌య‌ట ప‌డి ప్రాణాలు ద‌క్కించ‌కున్నారు. లేని ప‌క్షంలో చ‌ని పోయి ఉండేవారు. నిన్న లాంచీ గోదావ‌రి న‌దిలో మునిగి పోయిన ఘ‌ట‌న‌లో అమాయ‌కులైన గిరిజ‌న     ప్ర‌యాణీకులు మృతి  చెందారు.  

పుష్క‌రాల స‌మయంలో కూడా చంద్ర‌బాబు నిర్వాకం వ‌ల్ల 29 మంది భ‌క్తులు తొక్కిస‌లాట‌లో క‌న్ను మూశారు. ఈఘ‌ట‌న‌ల‌పై ప్ర‌భుత్వం  నామ మాత్రంగా విచార‌ణ‌కు ఆదేశిస్తోంది. విచార‌ణ నివేదిక‌ల‌పై ఎలాంటి చ‌ర్య‌లు లేవు. వాస్త‌వానికి విచార‌ణ‌ల‌ను ఎవ‌రిపై వేయాలి? ముఖ్య‌మంత్రి ఆయ‌న కుమారుడు మంత్రుల‌పై విచార‌ణ‌లు జ‌ర‌గాలి ఈ ఘ‌ట‌న‌ల‌కు బాధ్యులు వారే.  ముందు వారిపై విచార‌ణ‌లు వేసి చ‌ర్య‌లు తీసుకోవాలి. నిన్న‌టి ఘ‌ట‌న‌లో చ‌నిపోయిన వారి కుటుంబాల‌కు త‌క్ష‌ణం న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాలి. ఒక్కో కుటుంబానికి రూ 25 ల‌క్ష‌లు న‌ష్ట ప‌రిహారం ఇవ్వాలి. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలి. వంద బోట్ల‌ను నియంత్రించ‌డం స‌ర్కారుకు పాధ్యం కాదా?

 

Tags :