ASBL NSL Infratech

పూత రేకుల‌పై జీఎస్టీ తొల‌గించాల‌ని డిమాండు

పూత రేకుల‌పై జీఎస్టీ తొల‌గించాల‌ని డిమాండు

సానుకూలంగా స్సందించిన వైయ‌స్సార్‌సీపీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్‌

చేతి వృత్తితో త‌యారు చేసే మామిడి తాండ్ర‌. పూత రేకుల‌పై జీఎస్టీ ని తొల‌గించాల‌ని ఉత్ప‌త్తిదారులు ఇవాళ వైయ‌స్సార్‌సీపీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్‌ను కోరారు. సంవ‌త్స‌రం పొడ‌వునా ఇదే వృత్తిపై ఆధార ప‌డి జీవిస్తోన్న త‌మ‌కు జీఎస్టీ ఒక బెడ‌ద‌గా త‌యారు అయ్యింద‌ని మ‌హిళ‌లు ఆయ‌న దృష్టికి తీసుకుని వ‌చ్చారు. వైయ‌స్సార్‌సీపీ అధికారంలోకి రాగానే మీ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని వైయ‌స్సార్‌సీపీ అధ్య‌క్షుడు వారికి హామీ ఇచ్చారు. తూర్పు గోదావ‌రి జిల్లా ఆత్రేయ‌పురం శివారు వ‌ద్ద  ఈ ప‌రిశ్ర‌మ‌లో ప‌ని చేస్తోన్న మ‌హిళా కార్మికుల తో భేటీ అయి  వారు ఎదుర్కొంటోన్న స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు.

ఆత్రేయపురంలో ప్రజా సంకల్పయాత్ర మామిడితాండ్ర తయారీ విధానాన్ని జగన్ కు వివరిస్తున్న మహిళలు. లొల్ల, మెర్లపాలెం గ్రామాలలో ప్రజా సంకల్ప యాత్ర మామిడి ఆవకాయ తయారు చేసే మహిళలతో మాట్లాడుతున్న జగన్.

Click here for Photogallery

 

Tags :