ASBL NSL Infratech

ముగిసిన వైఎస్ జగన్ చారిత్రాత్మక పాదయాత్ర

ముగిసిన వైఎస్ జగన్ చారిత్రాత్మక పాదయాత్ర

వైయస్ జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలుః-

1) సీఎం.. సీఎం.. అంటూ మార్మ్రోగిన నినాదాలు
2) ఇన్ని వేల కిలోమీటర్ల పాదయాత్రలో.. ప్రజల గుండె చప్పుడును.. నా గుండె చప్పుడుగా మార్చుకున్నాను.
3) నడిచింది నేనైనా.. నడిపించింది మాత్రమే మీరూ.. ఆ దేవుని దీవెనలే.
4) హైదరాబాద్ నుంచి దుబాయ్ 3 వేల కిలో మీటర్లు.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దూరం 3440 కి. మీ. పాదయాత్ర రికార్డులను దాటేసింది.
5) ఎంత దూరం నడిచాం అన్నది ముఖ్యం కాదు.. ఎంత మంది ప్రజలను కలిశాం. ఎంతమందికి భరోసా ఇచ్చామన్నదే ముఖ్యం.
6)  600 హామీలు ఇచ్చి.. ప్రతీ కులాన్నీ ఎలా మోసం చేయవచ్చు అన్న దానిలో పీహెచ్ డీ చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు

7) రాష్టంలో కరువు పరిస్థితులు ఉంటే.. రెయిన్ గన్ ల పేరుతో చంద్రబాబు నాయుడు సినిమా చూపించారు.. అంటూ అనంతపురం జిల్లాకు చెందిన రైతు శివన్న యథార్థ గాథ వినిపించిన జగన్ గారు.

8) జాతీయ రాజకీయాల పేరుతో కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తిరుగుతారు కానీ.. మన రాష్ట్రంలో రైతన్నల కష్టాలను తీర్చాలన్న ధ్యాసే లేదు చంద్రబాబుకు.

9) రైతు ఆదాయంలో మన రాష్ట్రం రైతులు దేశంలోనే 28 వ స్థానంలో,  రైతు అప్పుల్లో మాత్రం 2వ స్థానంలో ఉంటే.. గ్రోత్ రేట్ లో నెంబర్ 1 అంటూ చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు. అందుకే చంద్రబాబును నమ్మం బాబూ.. అని రైతులు, ప్రజలు అంతా అంటున్నారు.

10) పొదుపు సంఘాలకు చెందిన అక్కచెల్లెమ్మల రుణాలు చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ. 14,2014 కోట్లు ఉంటే... ఇప్పుడవి వడ్డీలు పెరిగిపోయి రూ. 22,174 కోట్లకు చేరాయి. సున్నా వడ్డీ రుణాలకు కూడా బాబు ఎగనామం పెట్టాడు.

11) బాబు వచ్చాడు.. కానీ జాబు రాలేదు.. ఉన్న జాబులను ఊడగొడుతున్నాడు.. అని నిరుద్యోగ యువత అంటున్నారు. రాష్ట్ర విభజన సమయంలో 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే.. ఇప్పుడవి 2.40 లక్షలకు పెరిగినా.. ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ప్రతి ఇంటికీ రూ. 2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని ఎన్నికలకు ముందు చెప్పి.. ఇప్పుడు ఎన్నికలకు మూడు, నాలుగు నెలల ముందు, అదీ కొద్ది మందికే వెయ్యి ఇస్తానంటున్నాడు. 20 లక్షల కోట్ల పెట్టుబడులు.. 40 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటున్నాడు. అన్నీ అబద్ధాలే. జాబు రావాలంటే.. బాబు పోవాలి.. అందుకే యువత నిను నమ్మం బాబూ.. అంటున్నారు.

12) చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక.. అక్షరాలా 6 వేల ప్రభుత్వ స్కూళ్ళు మూసేశాడు. ఎస్సీ, ఎస్టీల హాస్టళ్ళు మూసేశాడు. కవిటి మండలంలో ఓ జూనియర్ కాలేజీలో కనీసం బాత్ రూమ్ లు కూడా లేవని ఓ విద్యార్థిని చెప్పింది. చంద్రబాబు మాత్రం మరుగుదొడ్ల నిర్మాణంలో నెంబర్ 1 అంటాడు. ఫీజులు కట్టలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 

13) రాష్ట్రంలో 23 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్న బడుల్లో టీచర్లు లేరు. పుస్తకాలు ఇవ్వటం లేదు.. ఈవిధంగా  ప్రభుత్వ స్కూళ్ళను నిర్వీర్యం చేస్తూ.. నారాయణ, చైతన్య సంస్థలను మాత్రం పెంచుతున్నారు చంద్రబాబు. 

14) ఆరోగ్యశ్రీలో నెట్ వర్క్స్ ఆసుపత్రులకు 8 నెలలుగా ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో.. ఆరోగ్యశ్రీ సేవలు రాష్ట్రంలో నిలిచిపోయాయి. ఉద్దానంలో 4 వేల మంది కిడ్నీ రోగులు డయాల్సిస్ చేయించుకుంటా ఉంటే.. వీరిలో కేవలం 1400 మందికి మాత్రమే ప్రభుత్వం వైద్యం అందిస్తోంది. కిడ్నీబాధితులకు పెన్షన్లు కూడా కేవలం 370 మందికి మాత్రమే ప్రభుత్వం ఇస్తోంది. 108 అంబులెన్స్ వస్తుందో.. రాదో తెలియని పరిస్థితి ఉంది. హైదరాబాద్ కు వెళితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందన్న నమ్మకం లేని పరిస్థితి. 

15) జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా నడుస్తోంది. రేషన్ కార్డు నుంచి మరుగుదొడ్డి వరకూ ఏది కావాలన్నా.. లంచం.. లంచం. గ్రామాల్లో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెన్షన్ కావాలంటే ఏ పార్టీ అని అడుగుతున్నారు. పెన్షన్ కావాలంటే బతికి ఉన్నా.. సర్టిఫికెట్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇంకోపక్క ఇసుక, మట్టి, బొగ్గు, మద్యం, కాంట్రాక్టులు.. ప్రతిదీ దోపిడే. 

16) చంద్రబాబు నాయుడు నోటికి-మెదడుకు కనెక్షన్ తెగింది. అందుకే నోటికేది వస్తే అది మాట్లాడుతున్నాడు. ఎన్నికలొచ్చేటప్పటికీ భయం పట్టుకుంది. ఆదరణ-2 అని, కొత్త ఇళ్ళు, పెన్షన్లు.. మరొకటి అని డ్రామాలు ఆడుతూ కొత్త సినిమా చూపిస్తున్నాడు.

17) ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తున్నాడు. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరిగా కొనుగోలు చేసి, అందులో నలుగుర్ని మంత్రుల్ని చేశాడు. 

18) చంద్రబాబు పాలన కావాలా ఇంకా? ఇలాంటి మనిషి కావాలా? అని అడుగుతున్నాను. 

19) నాలుగేళ్ళు ప్రత్యేక హోదాను ఖూనీ చేశాడు. ఆ నాలుగేళ్ళు బీజేపీతో కాపురం చేసి.. తన పార్టీకి చెందిన మంత్రులను బీజేపీ ప్రభుత్వంలో ఉంచుతాడు. నాలుగేళ్ళు బీజేపీ ప్రభుత్వాన్ని పొగుడుతాడు. ప్రత్యేక హోదా బీజేపీ ఇవ్వకపోయినా వారికి ధన్యవాదాలు చెబుతూ తీర్మానాలు చేస్తాడు.  అసెంబ్లీలో ప్రత్యేక హోదా కోసం మనం పోరాడితే వెటకారం ఆడతాడు. నాలుగేళ్ళు మోడీ- బాబు జోడి పేరుతో వారి మధ్య సాగిన ప్రేమ, పొగడ్తలు చూస్తే... వారి ప్రేమను చూసి.. చిలక-గోరింకలు కూడా సిగ్గుపడేలా ఉంది. 

20) గత రెండు మూడు నెలలుగా చంద్రబాబు రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడడు. చంద్రబాబు-మోడీకి మధ్య యుద్ధం అని ఈనాడు రాస్తోంది. ఆ పేపరు చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. నాలుగేళ్ళు చిలకా-గోరింకల్లా ప్రేమ.. ఎన్నికలకు మూడు నెలల ముందు యుద్ధమా? పేపర్లు, టీవీలు అడ్డం పెట్టుకొని చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడు. 

21) తాను చెప్పింది చేయకపోతే.. ఆ రాజకీయ నాయకుడ్ని రాజీనామా చేయించి ఇంటికి పంపించేలా చేయాలి.. అటువంటి విశ్వసనీయ రాజకీయాలు రావాలి. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను మార్చాలంటే.. అది జగన్ ఒక్కరి వల్ల సాధ్యపడదు. జగన్ కు మీ అందరి దీవెనలు కావాలి. 

22) ప్రతి పథకం ప్రతి పేదవాడి ఇంటికి చేరాలి. ఆ దిశగా పాలన ఉండాలి. ఆ పేదవాడు ఏ పార్టీ, ఏ కులం, మతం, అనేది అడ్డు కాకూడదు. వ్యవస్థలో మార్పు దిశగా మనమంతా అడుగులు వేయాలి. 

23) 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ను 25 జిల్లాల ఆంధ్రప్రదేశ్ గా మారుస్తాం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్నీ ఒక జిల్లాగా చేస్తాను. ఈ విధంగా జవాబుదారీతనం పెంచుతాం. కలెక్టర్లు ప్రజలకు మరింత చేరువ చేస్తాం.

24) ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియేట్ ను తీసుకొస్తాం. స్థానికులకే 10 మందికి ఉద్యోగాలు ఇస్తాం. ప్రతి పథకం పేదవాడి ఇంటి ముందుకే వచ్చే విధంగా చేస్తాను. ప్రతి 50 ఇళ్ళకు ఒకరికి గ్రామ వాలంటీయర్ గా తీసుకొని ఉద్యోగం ఇస్తాం. వీరికి రూ. 5 వేలు జీతం ఇస్తాం. వాలంటీయర్ ఆ 50 ఇళ్ళకు జవాబుదారీగా ఉంటూ.. గ్రామ సెక్రటేరియేట్ తో అనుసంధానమై పనిచేస్తూ.. నవరత్నాలు నుంచి రేషన్ బియ్యం వరకూ.. నేరుగా ఇంటికే వచ్చే విధంగా డోర్ డెలివరీ చేస్తాం. 

25) రైతులకు పెట్టుబడులు తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటాం. పగటి పూటే 9 గంటలపాటు ఉచితంగా కరెంటు ఇస్తాం. ప్రతి రైతు ఆదాయం పెంచడం కోసం.. బ్యాంకు రుణాలపై వడ్డీ లేకుండా సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాం. మే నెలలోనే రైతన్నకు పెట్టుబడి కోసం ఏడాదికి రూ. 12,500 ఇస్తాం. రైతులందరికీ బోర్లు ఉచితంగా వేయిస్తాం. పంట ఇన్సూరెన్స్ ల కోసం రైతులు ఇక ఆలోచించనక్కర్లేదు. అధికారంలోకి రాగానే. ఇన్సూరెన్స్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఆక్వా రైతుకు రూపాయిన్నరకే కరెంటు ఇస్తాం. గిట్టుబాటు ధరల కోసం రూ. 3000 కోట్లతో ధరల స్థిరీకరణ తీసుకొస్తాం. ప్రతి మండలంలోనూ కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తాం. ఈరోజు లీటర్ పాలు రూ. 26కు అమ్ముకుంటున్నారు. హెరిటేజ్ కోసం పాడి రైతులను నాశం చేశాడు చంద్రబాబు. హెరిటేజ్ లో మాత్రం అర లీటరు పాలు రూ. 45కు అమ్ముతున్నారు. పాడి ప్రోత్సాహం కోసం.. లీటరుకు రూ. 4 బోనస్ ఇస్తాం.  సహకార రంగం డైరీలను ప్రతి జిల్లాలో ప్రోత్సహిస్తాం. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ ను పూర్తిగా రద్దు చేస్తాం. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రైతు నష్టపోకుండా.. రూ. 4 వేల కోట్లు(రూ. 2వేల కోట్లు రాష్ట్రం ప్లస్ రూ. 2 వేల కోట్లు కేంద్రం ఇస్తుంది) ప్రకృతి వైపరీత్యాల ఫండ్ పెడతాం. కొబ్బెరి చెట్లు కు పరిహారం రూ. 3 వేలు ఇస్తాం. జీడి చెట్లకు ఇప్పుడు ఇస్తున్న రూ. 30 వేలును రూ.50 వేలుకు పెంచుతాం. రైతన్నకు జరగకూడని నష్టం ఏమైనా జరిగితే.. వైయస్ఆర్ బీమా కింద రూ. 5 లక్షలు వెంటనే ఆ కుటుంబానికి ఇస్తాం. ఆ నష్టపరిహారం పూర్తిగా ఆడపడుచులకు ఇచ్చే సొత్తుగా చూసే విధంగా అసెంబ్లీలో చట్టం తీసుకొస్తాం. దాంతో అప్పుల వాళ్ళు లాక్కొనే అవకాశం ఉండదు. ప్రతి ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేస్తాం.  

26) ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్ళు పాలించాలన్నది నాకున్న ఆశ. నా పాలన చూసి.. నాన్న ఫోటోతోపాటు నా ఫోటో కూడా ప్రతి ఇంట్లో ఉండాలన్నది నా ఆశ. 

27) నవరత్నాలను ప్రతి ఇంటికీ చేర్చండి. నవరత్నాల మేలును ప్రతి ఒక్కరికీ చెప్పండి. అవి జనంలోకి తీసుకెళితే.. చంద్రబాబు నాయుడు ఎంత డబ్బులిచ్చినా.. ఓటు వేయరు. 

28) ఆరు నెలలు కలిసి ఉంటే. వారు వీరు.. వీరు వారవుతారు. ఈ 14 నెలలు పేదవాడితోనే ఉన్నాను. వారి కష్టాలు వింటూనే.. వారికి భరోసా ఇస్తూనే నడిచాను. ప్రతి పేద వాడికి మంచి చేయాలనే తపన ఉంది. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగు చేసేందుకు బయలుదేరిన మీ బిడ్డకు తోడుగా ఉండమని, ఆశీర్వదించమని కోరుతున్నాను. 

29) ప్రజా సంకల్ప యాత్ర ఇంతటితో ముగుస్తున్నా.. పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఎన్నికలకు మూడు నెలల సమయం ఉంది. జరిగే యుద్ధం ఒక్క నారాసురుడితో మాత్రమే కాదు. ఈ నారాసురుడికి ఎల్లో మీడియా ఉంది. జిత్తులు మారి ఈ మాయావి చంద్రబాబు పొత్తులు, ఎత్తులను, అన్యాయాలను జయించేందుకు మీరంతా తోడుగా ఉండాలి.

Tags :