ASBL NSL Infratech

బంద్‌ను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు : వైయ‌స్ జ‌గ‌న్

బంద్‌ను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు : వైయ‌స్ జ‌గ‌న్

బంద్‌లో పాల్గొన్న ప్ర‌తి ఒక్క‌రికీ హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు. హోదా పోరాటం ఇంత‌టితో ఆగిపోదు.. బంద్ నిర్వీర్యం చేయ‌టానికి బాబు చేయ‌ని కుట్ర‌లు లేవు. పోలీసుల‌తో బంద్‌పై ఉక్కుపాదం మోపారు. కాకి దుర్గారావు మృతికి బాబే కార‌కుడు. రాజ‌కీయ స్వార్థాల‌తో బంద్‌లో కొన్ని పార్టీలు పాల్గొన‌లేదు- అది వారి విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తున్నా.. 

సీనియ‌ర్ నేత‌ల‌తో, సామాన్యుల‌తో ఇలానా పోలీసులు ప్ర‌వ‌ర్తించేది. 

హోదా ఏపీకి జీన్మ‌ర‌ణ స‌మ‌స్యః  వైయ‌స్ జ‌గ‌న్ 

- ప్ర‌త్యేక హోదా కావాల‌ని రాష్ట్ర ప్ర‌జలంతా ఆకాంక్షిస్తూ.. స్వ‌చ్ఛందంగా బంద్‌లో పాల్గొనే కార్య‌క్ర‌మం చేస్తే ద‌గ్గ‌రుండి అతి కిరాత‌కంగా, అతి దారుణంగా ప్ర‌త్యేక హోదాకు వ్య‌తిరేకంగా బంద్ విఫ‌లం చేయ‌టానికి చంద్ర‌బాబు చేయ‌ని కుట్ర‌లు లేవు.

- ఈరోజు జ‌రిగిన బంద్ చూస్తే మొట్ట‌మొద‌టిగా ఇన్ని కుట్ర‌ల మ‌ధ్య‌, దారుణ‌మైన అణ‌చివేత మ‌ధ్య బంద్ విజ‌య‌వంతం అయింది. బంద్‌లో పాల్గొని ప్ర‌త్యేక హోదా మా హ‌క్కు అని చాటినందుకు అన్ని సంఘాలకు, మేథావుల‌కు, దుకాణాల య‌జమానుల‌కు, స్కూల్స్ యాజ‌మాన్యాలకు, విద్యార్థుల‌కు అంద‌రికీ హృద‌య‌పూర్వ‌కంగా కృత‌జ్ఞ‌త‌లు.

- బంద్ విష‌యానికి వ‌స్తే.. శ్రీ‌కాకుళం జిల్లా 300 మందికి పైగా అరెస్ట్‌. జిల్లాలో త‌మ్మినేని సీతారాం నుంచి ప్ర‌తి ఒక్క ముఖ్య‌మైన నాయ‌కులు అంద‌రినీ అరెస్ట్ చేశారు. 

- విజ‌య‌న‌గరంలో 300 మందికి పైగా అరెస్ట్ చేశారు. స్వ‌చ్ఛందంగా దుకాణాలు మూసేశారు. 

- విశాఖ‌లో బొత్స స‌త్య‌నారాయ‌ణ అరెస్ట్ చేశారు. పార్టీ నేత‌ల‌ను అరెస్ట్ చేశారు. స్వ‌చ్ఛందంగా సంస్థ‌లు మూత వేశారు. 

- తూర్పు గోదావ‌రి జిల్లాలో వాణిజ్య‌, విద్యాసంస్థ‌లు మూత‌ప‌డ్డాయి. ధ‌ర్నాలు, రాస్తారోకోలు జ‌రిగాయి. పోలీసుల‌తో నేత‌ల‌ను అరెస్ట్ చేయించారు. నేత‌ల్ని అదుపులోకి తీసుకొని బ‌స్సుల్ని న‌డిపించేందుకు ప్ర‌య‌త్నించారు. 

- ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాః వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల‌నానిని ఏలూరులో అరెస్ట్ చేశారు. సీనియ‌ర్ నేత‌ల‌ను అరెస్ట్ చేశారు. బుట్టాయ‌గూడెంతో కాకి దుర్గారావు అనే సోద‌రుడు గుండెపోటుతో మ‌ర‌ణించారు. జిల్లాలో 300 పైగా అరెస్ట్‌లు.

- ప్ర‌కాశం జిల్లాలో 144 సెక్ష‌న్‌తో పోలీస్ యాక్ట్ పెట్టి మ‌రీ  పార్టీ నేత‌ల‌ను అరెస్ట్ చేశారు. బాలినేని వాసు, మ‌హీధ‌ర్ రెడ్డి వ‌ర‌కు అరెస్ట్‌. జిల్లా వ్యాప్తంగా 600 మంది అరెస్ట్‌లు. అయినా దుకాణాలు స్వ‌చ్ఛందంగా మూసేసి బంద్ విజ‌యవంతం చేశారు.

- నెల్లూరులో .. కాకాణి, అనిల్‌.. ఇలా పార్టీ నేత‌ల్ని అంద‌ర్నీ అరెస్ట్ చేశారు. 

- క‌ర్నూలు జిల్లాలోని నంద్యాల‌లో డీఎస్పీ మ‌హిళ‌ల ప‌ట్ల అనుచితంగా ప్ర‌వ‌ర్తించారు. మ‌హిళా పోలీసులు లేకుండా ఎత్తేయ‌టంతో వారికి గాయాలు అయ్యాయి. 

- వైయ‌స్సార్ జిల్లాలో ఎక్క‌బ‌డితే అక్క‌డ అరెస్ట్ చేశారు. ఆకే అమ‌ర్నాథ్ ద‌గ్గ‌ర నుంచి నేత‌లు అంద‌ర్నీ అరెస్ట్ చేశారు. 

- అనంత‌పురం జిల్లాలో వెంక‌ట్రామ‌రెడ్డిని అరెస్ట్ చేశారు. తోపులోట వెయ్యిమందికి పైగా అరెస్ట్‌. విద్యాసంస్థ‌లు బంద్ పాటించాయి. 

- చిత్తూరులో - సీనియ‌ర్ నాయ‌కులు అంద‌ర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. 1200 మంది అరెస్ట్‌. కుప్పంలోనూ వాణిజ్య సంస్థ‌లు మూతప‌డ్డాయ్‌.

- కృష్ణాలో పార్థ‌సార‌ధి, మ‌ల్లాది విఘ్ణ‌, రాధాతో పాటు 600 పైగా అరెస్ట్‌. 

- గుంటూరులో సీనియ‌ర్ నాయ‌కులు అంద‌రూ అరెస్ట్‌. 1100 మంది అరెస్ట్‌. 

చంద్ర‌బాబే ముందుకు వ‌చ్చి మీ ఎంపీల చేత రాజీనామాలు చేయించి దేశ‌మంతా మ‌న‌వైపు చూసేట్టు చేయాలి. బాబే బంద్‌లో పాల్గొనాల్ని సంద‌ర్భంలో నిర్వీర్యం చేయ‌టానికి ప్ర‌య‌త్నించారు. అవిశ్వాస తీర్మానంలో ప్ర‌త్యేక హోదా ఇవ్వండ‌ని డిమాండ్ చేస్తే.. మీ వ‌ల్లే (బాబు) ఇవ్వ‌కుండా ఉన్నామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం చెబుతోంది. చంద్ర‌బాబు అడ‌గ‌టం వ‌ల్లే హోదా బ‌దులు ప్ర‌త్యేక ప్యాకేజీ ఇస్తున్నామ‌ని చెబితే నిర‌స‌న తెల‌పాల్సిపోయి.. ప్ర‌త్యేక హోదాకు అడ్డుత‌గిలిన బీజేపీకి, హోదాకు అడ్డుత‌గిలిన మీ మీద బంద్ కాల్‌కు పిలుపు ఇస్తే.. చంద్ర‌బాబు చేసిన నిర్వాకం ఇదని శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు.  

- వెస్ట్ గోదావ‌రిలో దుర్గారావు గుండె పోటుతో చ‌నిపోయారు. కార‌ణం చంద్ర‌బాబు కాదా?  హోదా కావాల‌ని ఓ స్వ‌రం గ‌ట్టిగా అడిగితే.. అత‌నికి గుండెపోటు వ‌చ్చేట్లు చేసింది చంద్ర‌బాబు కాదా? మ‌హిళ‌ల‌ను చూడ‌లేదు. కాల‌ర్ ప‌ట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్లారు. పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. మ‌హిళ‌ల‌ను అని చూడ‌కుండా మ‌గ పోలీసుల‌తో నిర్భందం. విద్యార్థుల‌ను ఈడ్చుకుంటూ పోతున్నారు. 

సీనియ‌ర్ నేత‌ల‌తో ప్ర‌వ‌ర్తించే తీరు ఇదా? 

- అనంత వెంక‌ట్రామ‌రెడ్డిని సీనియ‌ర్ నేత‌. 5,6 సార్లు ఎంపీగా చేశారు. ఆయ‌న‌తో ప్ర‌వ‌ర్తించిన తీరును శ్రీ జ‌గ‌న్ ఫొటోను చూపించారు. ఒంగోలులో బాలినేని వాసు మాజీ మంత్రితో ప్ర‌వ‌ర్తించిన తీరు. త‌మ్మినేని సీతారాం, మాజీ మంత్రితో ఆయ‌న‌తో పోలీసులు ప్ర‌వ‌ర్తించిన తీరును ఫొటోలు చూపించారు.

- చంద్ర‌బాబుకు బుద్ది వ‌చ్చేలా ప్ర‌జ‌లు చేస్తారు. ఆయ‌న చేస్తున్న అబ‌ద్ధాలు, మోసాలు తారాస్థాయికి చేరే పరిస్థితి. శిశుపాలుడుకు కూడా త‌ప్పు చేస్తే శిక్ష ప‌డ్డ‌ట్లు.. బాబు కూడా 100 త‌ప్పుల‌కు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేశాడు. దేవుడు మెట్టికాయ‌లు వేస్తాడు. ప్ర‌జ‌లు శిక్ష వేస్తారు. 

ప్ర‌త్యేక హోదా రాక‌పోవ‌టానికి చంద్ర‌బాబు చేయాల్సిన ప‌నులు చేయాల్సిన స‌మ‌యంలో చేయ‌క‌పోవ‌టం వ‌ల్ల రాలేదు. ఇది వాస్త‌వం. హోదా పోరాటం ఇంత‌టితో ఆగిపోదు. హోదా వ‌చ్చే వ‌ర‌కు ఒత్తిడి కొన‌సాగిస్తాం. బాబుకు సిగ్గు, శ‌రం ఉన్నా హోదా కోసం చిత్త‌శుద్ధితో ముందుకు రావాలి. భావిత‌రాలు చంద్ర‌బాబును చరిత్ర హీనుడుగా చూస్తాడ‌న్న విష‌యం మ‌ర్చిపోవ‌ద్దు.

 

Tags :