ASBL NSL Infratech

ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై ప్రశంసలు

ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై  ప్రశంసలు

అంతర్జాతీయ వేదికపై ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి మరోసారి మార్మోగింది. అందరికీ ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సు ప్రశంసలు కురిపించింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై (సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్) శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక సెషన్‌లో ‘ఇంటర్నెట్ ఫర్ ఆల్’ అనే అంశంపై చర్చ జరిగింది. ఇందులో ఏపీ ఫైబర్ నెట్, సీఎం కోర్ డ్యాష్ బోర్డుపై ఉగండా, బ్రెజిల్ సహా పలు దేశాలు ఆసక్తి కనబరిచాయి. అందరికీ ఇంటర్నెట్ విషయంలో ఏపీ అనుసరణీయంగా వుందని, దీనిపై ప్రపంచదేశాలు దృష్టి పెట్టాలని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధికారులు సూచించారు. ఫైబర్ గ్రిడ్ కార్యక్రమాన్ని పరిశీలించడానికి త్వరలో రాష్ట్రానికి ప్రత్యేక బృందాన్ని పంపనున్నట్టు చెప్పారు. ఏపీలో అమలుచేస్తున్న జల సంరక్షణ విధానాలు, సీయం కోర్ డ్యాష్ బోర్డును సైతం ఈ బందం అధ్యయనం చేయనుంది. 


Click here for Photogallery

 

Tags :