ASBL NSL Infratech

ఫిట్స్ బర్గ్ లో టీటీడీ వారిచే ఆగమ సదస్సు

ఫిట్స్ బర్గ్ లో టీటీడీ వారిచే ఆగమ సదస్సు

సాధారణం గా హిందు దేవాలయాలు అన్ని ఆగమ శాస్త్రం ఆధరంగా నిర్మిస్తారు..  గుడిని మెయిన్ టైన్ చేస్తారు. మొదటిసారి గా అమెరికా లో ఉన్న శ్రీ వెంకటేశ్వర దేవాలయాలు అన్నింటిని ఒక చోట కు పిలిచి ఆగమ శాస్త్రం మీద ఓ రెండు రోజుల వర్క్ షాప్ ఫిట్స్ బర్గ్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో టీటీడీ వారు 29-30 సెప్టెంబర్ న జరిపారు. 

టీటీడీ నుంచి శ్రీ పోల భాస్కర్, JEO గారు ఇతర పండితులు వచ్చారు. అమెరికా లోని 17 దేవాలయాల వారు వచ్చారు. Sessions చాలా టెక్నికల్ గా వుంటాయనుకొంటే... ఇతర దేవాలయ అధికారులు, పుజారులకు మాత్రమే కాకుండా నాలాంటి వాడికి కూడా ఆర్థం అయ్యేలా చెప్పారు.  చాలా విషయాలు తెలుసుకున్నాం.

ఆగమ శాస్త్రం ప్రకారం ఏ ఏ పూజలు జరగాలి? ఎప్పుడు జరగాలి? ఎలా జరగాలి? లాంటి ఎన్నో విషయాలు వివరించారు. 

గుడి తలుపులు పొద్దునే సూర్యోదయం టైం లోనే తెరవాలి...కానీ అమెరికా లో  9am కి తెరుస్తారు.. పరవాలేదా? లాంటి పాయింట్ నుంచి.. దేముడు విగ్రహనికి చిన్న దెబ్బ తగిలి..ఓ వేలు, చెయ్యి దగ్గర విరిగింది...ఎం చెయ్యాలి లాంటి పెద్ద పాయింట్ లు వరకు అనేక విషయాలు వివరించారు.

నగరం లో ఉన్న భక్తుల కోసం శనివారం సాయంత్రం శ్రీనివాస కల్యాణం కూడా వైభవం గా జరిగింది.

 

Tags :