ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఆగమ సదస్సు కు తయారవుతున్న ఫిట్స్ బర్గ్ దేవాలయం

ఆగమ సదస్సు కు తయారవుతున్న ఫిట్స్ బర్గ్ దేవాలయం

తిరుమల తిరుపతి దేవస్తానం ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తున్న ఆగమ శాస్త్ర సదస్సు కి ఫిట్స్ బర్గ్ శ్రీ వెంకటేశ్వర దేవాలయం తయారవుతోంది. ఈ రోజు సాయంత్రం ఫిట్స్ బర్గ్ దేవాలయం లో జరిగిన రివ్యూ మీటింగ్ లో దేవాలయ కార్య వర్గ సభ్యులతో టీటీడి జెఈఓ శ్రీ పోల భాస్కర్ రేపటి సదస్సు సంబంధించిన ఏర్పాట్లని సమీక్షించారు.

ఫిట్స్ బర్గ్ దేవాలయం నుంచి శ్రీ సుబ్బారెడ్డి, టెంపుల్ అడ్మినిస్ట్రాటర్, విజయ్ రెడ్డి, ప్రెసిడెంట్ వారి వారి ఏర్పాట్ల ను వివరించారు. వచ్చిన అతిధుల కోసం చేసిన ఏర్పాట్లు వివరించారు. 

శ్రీ పోల భాస్కర్, జెఈఓ, టీటీడి మాట్లాడుతూ ఆగమ శాస్త్రల పై సదస్సు ఎందుకు నిర్వహిస్తున్నామో, సదస్సు లో ఎం చెప్పబోతామో లాంటి విషయాలు వివరించారు.

ఈ మీటింగ్ లో శ్రీమతి గౌతమి, డిప్యూటీ ఇఓ, శ్రీ సుబ్బా రావు చెన్నూరి, తెలుగు టైమ్స్, శ్రీ శ్రీనివాసాచార్యులు, శ్రీ పురుషోత్తమాచార్యులు కూడా పాల్గొన్నారు.

Click here for Photogallery

 

Tags :