ASBL NSL Infratech

టిఫాస్ ఉగాది వేడుకల్లో 'పాఠశాల' ప్రముఖులకు సత్కారం

టిఫాస్ ఉగాది వేడుకల్లో 'పాఠశాల' ప్రముఖులకు సత్కారం

న్యూజెర్సిలో తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల్లో 'పాఠశాల' సిఇఓ, తెలుగు టైమ్స్‌ ఎడిటర్‌ చెన్నూరి వెంకట సుబ్బారావును, పాఠశాల ఏరియా డైరెక్టర్‌ రామ్‌ వేదాంతంను ఘనంగా సత్కరించారు. తెలుగు భాషకు, సంస్కృతికి వారు చేస్తున్న కృషికి గుర్తింపుగా టిఫాస్‌ వారిని సత్కరించింది. వీరితోపాటు కుమార్‌ తాడేపల్లి, శ్రీమతి రేణు తాడేపల్లి, శ్రీమతి సుచరిత గడ్డం, శ్రీరంగతోపాటు పాఠశాల టీచర్లు, కో ఆర్డినేటర్లను కూడా వేదికపై పిలిచారు. టిఫాస్‌ ప్రెసిడెంట్‌ గురుఆలంపల్లి సుబ్బారావుకు మెమోంటో అందజేశారు.

ఈ సందర్భంగా చెన్నూరి సుబ్బారావు మాట్లాడుతూ, పాఠశాలకు టిఫాస్‌ ఇస్తున్న మద్దతు అభినందనీయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌  గుర్తింపుతో పాఠశాల అన్నీ కేంద్రాల్లో విజయవంతంగా నడుస్తోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విద్యాశాఖ ఎన్నారై పిల్లలకోసం ప్రత్యేకంగా రూపొందించిన 4 సంవత్సరాల కోర్సును పాఠశాల బోధిస్తోందని చెప్పారు. మీ ప్రాంతాల్లో ఉన్న పాఠశాల కేంద్రాల్లో చిన్నారులను చేర్పించాలని ఈ సందర్భంగా సుబ్బారావు కోరారు. ఏరియా డైరెక్టర్‌ రామ్‌ వేదాంతం మాట్లాడుతూ, న్యూజెర్సిలో వివిధ ప్రాంతాల్లో ఉన్న పాఠశాల కేంద్రాలు విజయవంతంగా నడుస్తున్నాయని చెప్పారు. ఈ వేడుకల్లో టిఫాస్‌ నాయకులు సుధాకర్‌ ఉప్పల, గురు ఆలంపల్లి, సుధాకర్‌ రాయపూడి, మధు అన్న, ఆనంద్‌ అండి పాలూరి తదితరులు పాల్గొన్నారు.

Click here for Event Gallery

 

Tags :