ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

రంగారెడ్డి జిల్లాలో 'తానా' క్యాన్సర్ శిబిరం

రంగారెడ్డి జిల్లాలో 'తానా' క్యాన్సర్ శిబిరం

రంగారెడ్డి జిల్లాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో క్యాన్సర్‌ నిర్దారణ శిబిరాన్ని చిలుకూరులో డిసెంబర్‌ 7వ తేదీన ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి ప్రముఖులతోపాటు తానా ఫౌండేషన్‌ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ లక్ష్మీ దేవినేని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంఎన్‌జే ప్రభుత్వ క్యాన్సర్‌ ఆసుపత్రి డైరెక్టర్‌ జయలత మాట్లాడుతూ, క్యాన్సర్‌ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. తానా ఫౌండేషన్‌ సౌజన్యంతో బసవతారకం ఇండో అమెరికన్‌ కాన్సర్‌ హాస్పిటల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆధ్వర్యంలో ఈ ఉచిత క్యాన్సర్‌ నిర్ధారణ శిబిరం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలుషిత ఆహారం, ధూమపానం, మద్యపానం క్యాన్సర్‌కు ప్రధాన కారణాలన్నారు. స్త్రీలలో చాలా మంది రొమ్ము క్యాన్సర్‌, గర్భాశయ క్యాన్సర్‌ భారిన పడుతున్నారన్నారు. క్యాన్సర్‌ను మొదటి రెండో దశలో గుర్తిస్తే చికిత్స ద్వారా నయం చేసుకోవచ్చన్నారు. దేశంలో ఏటా 10 లక్షల మంది క్యాన్సర్‌ బారిన పడుతున్నారని, దీనికి అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకుగాను స్వచ్చంద సంస్థలు గ్రామాలు, పట్టణాల్లో సదస్సులు  నిర్వహించాలని కోరారు. తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో క్యాన్సర్‌ నిర్థాణ శిబిరం, అవగాహన సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ  సందర్బంగా 400 మందికి పరీక్షలు నిర్వహించారు.వారికి నాలుగురి ప్రాథమిక స్థాయిలో క్యాన్సర్‌ లక్షణాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.

తానా ఫౌండేషన్‌ రీజనల్‌ కోఆర్డినేటర్‌ లక్ష్మి దేవినేని మాట్లాడుతూ  తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం డిసెంబర్‌లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే చిలుకూరులో క్యాన్సర్‌ నిర్ధారణ శిబిరం ఏర్పాటు చేశామని. క్యాన్సర్‌పై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు అత్యాధునిక పరికరాలతో పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. తానా ఫౌండేషన్‌ ద్వారా అమెరికాలో సైతం నిత్యం వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు కూడా తెలియజేశారు.

కార్యక్రమంలో బసవతారకం ఇండో అమెరికన్‌ హాస్పిటల్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కల్పనా రఘనాథ్‌, ఎన్నారై  సందీప్‌, ఎంపీడీఓ  సుభాషిణి,  సర్పంచ్‌ గున్నాల సంగీత, ఎంపీటీసీ సహదేవ్‌, ఉపసర్పంచ్‌ నర్సింహ్మగౌడ్‌, మాజీ ఉపసర్పంచ్‌ గున్నాల గోపాల్‌రెడ్డి, హోమియోపతి ఆసుపత్రి వైద్యులు రాంచందర్‌ వార్డు సభ్యులు, పౌండేషన్‌ ప్రతినిధులు వైద్యులు పాల్గొన్నారు.

 

Tags :