ASBL NSL Infratech

వైభవంగా టీఏజీసీ ఉగాది వేడుకలు

వైభవంగా టీఏజీసీ ఉగాది వేడుకలు

చికాగో మహా నగర తెలుగు సంస్థ(టీఏజీసీ) ఆధ్వర్యంలో విళంబి నామ సంవత్సర ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. చికాగోలోని స్ట్రీమ్‌వుడ్‌ హై స్కూల్‌ ఆడిటోరియంలో ఏప్రిల్‌ 14న జరిగిన ఈ వేడుకల్లో దాదాపు 1000మంది తెలుగు వారు పాల్గొన్నారు. 325 మంది స్థానిక కళాకారులు వివిధ కార్యక్రమాలతో అతిథులను అలరించారు. కిడ్స్‌ కామెడీ స్కిట్‌, బాల రామాయణం, దివంగత నటి శ్రీదేవికి నివాళి, ఉగాది, శ్రీరామనవమికి సంబంధించి కార్యక్రమాలు, డ్యాన్సులు అందరిని ఆకట్టుకున్నాయి. టీఏజీసీ అధ్యక్షులు జ్యోతి చింతలపాణి, కల్చరల్‌ కమిటీ ఛైర్మన్‌ రంగారెడ్డి లెంకల, కో ఛైర్స్‌ ఉమా అవదూత, శ్వేత జనమంచి, మాధవి కొనకొల్లలు, కల్చరల్‌ కమిటీ సభ్యులు, కో ఆర్డినేటర్స్‌ గత 6 వారాలుగా ఈ వేడుకల కోసం అహర్నిశలు క షి చేశారు. వేడుకల డెకరేషన్‌ పనులను వాణి యెంట్రింట్ల దగ్గరుండి చూశారు. టీఏజీసీ మెంబర్‌షిప్‌ కమిటీ, ప్రవీణ్‌ వేములపల్లి, మమత లంకల, విజయ్‌ బీరం, మమత లంకలలు అతిథులను సాధరంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా పీఎంఎస్‌ఐకి చెందిన అశోక్‌ లక్ష్మణన్‌, టీఏజీసీ అధ్యక్షులు జ్యోతి చింతలపాణి, మాజీ అధ్యక్షులు ప్రదీప్‌ కందిమళ్ల, యూత్‌ ఛైర్‌ అవినాష్‌ లటుపల్లి ఎంపిక చేసిన యువతకు ప్రెసిడెన్షియల్‌ వాలంటీర్‌ సర్వీస్‌ అవార్డ్‌(పీవీఎస్‌ఏ) సర్టిఫికెట్స్‌ అందజేశారు. ఫుడ్‌ కమిటీ ఛైర్‌ శ్రీనివాస్‌ కంద్రు ఉగాది పచ్చడితోపాటూ, రుచికరమైన వంటకాలను అతిథుల కోసం ఏర్పాటు చేశారు. బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ అంజి రెడ్డి కందిమల్ల, సంపత్‌ సప్తగిరిలు ఆహారం సరఫరా, ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో సహకరించిన ఎగ్జిక్యూటివ్‌ కమిటీ, బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌, వాలంటీర్లకు జ్యోతి చింతలపాణి క తజ్ఞతలు తెలిపారు.

Click here for Event Gallery

 

Tags :