ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

వారికి సమాధానం చెప్పి తీరాల్సిందే : రాహుల్

వారికి సమాధానం చెప్పి తీరాల్సిందే : రాహుల్

హామీలు నెరవేర్చకుండా, ఉద్యోగాలివ్వకుండా కేసీఆర్‌ యువతను మోసగించారని, తమకు జరిగిన అన్యాయంపై తెలంగాణ యువత నిలదీస్తోందని వారికి కేసీఆర్‌ సమాధానమివ్వాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నిలదీశారు. జోగులాంబ జిల్లాలోని గద్వాల, వికారాబాద్‌ జిల్లాలోని తాండూరులో ప్రజాకూమటి సభలు, హైదరాబాద్‌లో పలు నియోజకవర్గాలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి నిర్వహించిన సభల్లో రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మొన్న టీఆర్‌ఎస్‌ సభలో ఒక యువకుడు లేచి తమకేం చేశారంటూ ముఖ్యమంత్రిని ప్రశ్నించాడు. దానికి సమాధానం చెప్పకుండా, కూర్చో మీ నాన్నకు చెబుతా అని సీఎం బెదిరించారు. నేను అడుగుతున్నాను కేసీఆర్‌జీ యువత మిమ్మల్ని ప్రశ్నిస్తోంది. మీరు వారికి సమాధానమివ్వాలి. క్షమాపక్షణ చెప్పాలి. మీరు ప్రాజెక్టుల పునరాకృతుల పేరిట అవినీతికి పాల్పడారు.

యువత ఉద్యోగాల కల్పనకు ఏం చేశారు? హైదరాబాద్‌ నగరాన్ని చంద్రబాబు, కాంగ్రెస్‌ అభివృద్ధి చేసి ప్రపంచస్థాయి నగరంగా ఖ్యాతి తీసుకొచ్చారు. గత ఐదేళ్లుగా హైదరాబాద్‌ ప్రజలకు మీరు ఏం చేశారు? ఈ ప్రశ్నకు ముఖ్యమంత్రికి, ఆయన భాగస్వామి పార్టీ అయిన ఎంఐఎంకు కూడా అని అన్నారు. సీపీఐ, టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు పార్లమెంటులో ప్రధానమంత్రిని వ్యతిరేకిస్తున్నాం. మీరు ఎటువైపు? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మోదీ సర్కారుకు మద్దతివ్వొదంటూ మేమందరం కోరినా మీరెందుకు మద్దతిచ్చారు? నోట్ల రద్దు తప్పుడు నిర్ణయమని చెప్పినా మీరెందుకు సమర్థించారు? గబ్బర్‌సిగ్‌ టాక్స్‌ (జీఎస్టీ)తో ఇక్కట్లు పడుతున్నామని దేశ ప్రజలందరికి తెలుసు. అయినా మీరెందుకు దానిని  ప్రశంసల్లో ముంచెత్తారు?  తెలంగాణలో కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, తెజసలతో కూడిన ప్రజాకూటమి కేసీఆర్‌, ఎంఐఎంను ఓడించబోతోంది. ఇక్కడితో పని పూర్తికాలేదు. తొలుత ఇక్కడ విజయం సాధించి, 2019 ఎన్నికలో మోదీ సర్కారునూ గద్దె దించుతాం. అందరం కలిసికట్టుగా పోరాడి ఓడిస్తాం  అని అన్నారు.

 

Tags :