ASBL NSL Infratech

ఆటా సదస్సుకు వినోద్ రెడ్డి

ఆటా సదస్సుకు వినోద్ రెడ్డి

అమెరికన్‌ తెలంగాణ అసోసియేషన్‌ (ఆటా) ఈ నెల 29 నుంచి జులై ఒకటో తేదీ వరకు నిర్వహించనున్న వరల్డ్‌ తెలంగాణ కన్వెన్షన్‌-2018 కు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎమ్మార్జీ వినోద్‌రెడ్డి హాజరుకానున్నారు. హూస్టన్‌లోని జార్జ్‌ బ్రౌన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొంటారు. ఈ మేరకు ఆయన నేడు అమెరికా బయలుదేరి వెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులతో సహా వివిధ రాజకీయ పార్టీల నేతలకు సంఘం ఆహ్వానం పంపించిందని వినోద్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

 

Tags :