ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

నాటా మహాసభలు ఘనంగా ప్రారంభం

నాటా మహాసభలు ఘనంగా ప్రారంభం

ఉత్తర అమెరికా తెలుగు సమితి ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌లో నిర్వహిస్తున్న మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బాంక్వెట్‌ కార్యక్రమంతో వేడుకలను ప్రారంభించారు. అమెరికాలోని ఇతర సంఘాల ప్రముఖులు, అమెరికా నలుమూలల నుంచి తరలివచ్చిన తెలుగువారితో ఈ మహాసభ ప్రాంగణం క్రిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా నాటా అధ్యక్షుడు రాజేశ్వర్‌ రెడ్డి గంగసాని తొలుత అందరికీ ఘనంగా స్వాగతం పలికారు. ఆయనతోపాటు రాఘవరెడ్డి గోసాల తదితర నాటా నాయకులు కూడా మాట్లాడారు. ఈ మహాసభల విజయవంతానికి సహకరించిన నాటా అడ్వయిజర్‌ చైర్మన్‌ డాక్టర్‌ ప్రేమ్‌సాగర్‌ రెడ్డి గారికి, ఇతర సభ్యులు జితేందర్‌ రెడ్డిగారికి ఇతరులకు నాటా నాయకులు ధన్యవాదాలు తెలిపారు.

ఇండియానుంచి వచ్చిన పలువురు రాజకీయ నాయకులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ నాయకులు మధుయాష్కిగౌడ్‌, రేవంత్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకుడు మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

పలువురికి నాటా అవార్డుల ప్రదానం

ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌లో నిర్వహిస్తున్న నాటా మహాసభల్లో భాగంగా వివిధ రంగాల్లో సేవలందిస్తున్న పలువురు ప్రముఖులకు నాటా అవార్డులను అందజేసి సత్కరించింది. మనబడి ప్రముఖుడు శరత్‌వేట, గిరిజ కొమురవేలు దంపతులు, ఫణిడొక్కా, సరోజాసాగరం, పి. రవీందర్‌ రెడ్డి, శ్రీనాథ్‌ గొల్లపల్లి, డాక్టర్‌ నాగగోపాల్‌ వెన్న, దాము గెదెల, గీతా, చిత్ర, ప్రసాద్‌, శ్రీధర్‌ రెడ్డి మరంగంటి, తనూజ్‌ ఆలంపాటి, మాగుంట శ్రీనివాసులు, ప్రవీణ్‌, రామారావుకు అవార్డులను బహూకరించారు.

Click here for Event Gallery

Tags :