ASBL NSL Infratech

నాటా సాహిత్య కార్యక్రమాలు.. విశిష్ట సాహితీ ప్రక్రియల అపూర్వ సంగమం

నాటా సాహిత్య కార్యక్రమాలు.. విశిష్ట సాహితీ ప్రక్రియల అపూర్వ సంగమం

డల్లాస్‌లో జూన్‌ 30 నుంచి జూలై 2వ తేదీ వరకు డల్లాస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించే నాటా మహాసభల్లో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలతోపాటు సాహిత్య కార్యక్రమాలకు కూడా పెద్ద పీట వేశారు. నాటా సాహిత్య విభాగం సమన్వయకర్త డా. నరసింహారెడ్డి ఊరిమిండి ఆధ్వర్యంలో జరుగుతున్న సాహిత్య కార్యక్రమంలో ఎంతోమంది ప్రముఖకవులు పాల్గొంటున్నారు.

అపూర్వసంగమం పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో డా. ఆకేళ్ళ బాలభాను - అవధాని, సంచాలకులు - డా. పుదూర్‌ జగదీశ్వరన్‌, ఛందోభాషణం - బ్రహ్మశ్రీ డా. రామడుగు నరసింహాచార్యులు, అప్రస్తుత ప్రసంగం - సుజన పాలూరి, అశువు - శర్వాణి గండ్లూరి, న్యస్తాక్షరి -  స్వాతి కుప్పిలి, వర్ణన - శ్రీవాణి బయ్యారపు, సమస్య - కృష్ణ కరుణాకర్‌ కాశీభట్ల, దత్తపది - సుషుమ్న అడుసుమల్లి, నిషిద్దాక్షరి - డా. జయకృష్ణ బాపూజీ జంధ్యాల, అధ్యక్షులు - డా. నరాల రామారెడ్డి పాల్గొంటున్నారు.

 

Click here for Event Flyers

 

 

Tags :