ASBL NSL Infratech

వాషింగ్టన్ లో 7న ఉగాది వేడుకలు

వాషింగ్టన్ లో 7న ఉగాది వేడుకలు

వాషింగ్టన్‌లో విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఏప్రిల్‌ 7వ తేదీన వైభవంగా జరపనున్నారు. స్థానిక బృహత్తర వాషింగ్టన్‌ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో జరిగే ఈ  ఉగాది వేడుకలు స్టోన్‌ బ్రిడ్జ్‌ ఉన్నత పాఠశాలలో సాయంత్రం 4 గంటల నుండి 10 గంటల వరకు జరుగుతుంది. తెలుగు సినీ తార అనిషా ఆంబ్రోస్‌, వ్యాఖ్యాత అశ్విని శర్మ, బహుముఖ ప్రజ్ఞాశాలి మిమిక్రీ కళాకారులు శివా రెడ్డి, పంచాంగ శ్రవణం, షడ్రుచుల ఉగాది పచ్చడి, ఇంద్రజాలం ప్రదర్శన, కుర్రకారు ప్రతిభా ప్రదర్శన, మరెన్నో స్థానిక సాంస్కృతిక కార్యక్రమాలతో ఉగాది సంబరాలను గ్రేటర్‌ వాషింగ్టన్‌ తెలుగు సాంస్కృతిక సంఘం నిర్వహిస్తోంది.

 

Tags :