ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఘనంగా టాంపా బే ఉగాది ఉత్సవాలు

ఘనంగా టాంపా బే ఉగాది ఉత్సవాలు

పోతన వర్ణించిన వామనావతారం లాగ ఇంతింతై వటుడింతయై మరియు తానింతై అన్నట్లు టాంపా బే వాసుల తెలుగు సంఘం తమ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు ఏకంగా  ఫెయిర్ గ్రౌండ్స్ లో శనివారం మే 14  తెలుగు వారికి సాయంత్రం ఏర్పాటు చేసారు. ఈ సందర్భానికి తగట్టు గానే ఈ సంబరాలలో పాల్గొనడానికి 1800 మందికి పైగా జనం రావడం టాంపా తెలుగు వారికి కొత్త రికార్దే.

ఎప్పటి లాగే టాంపా తెలుగు వారు తెలుగుతనం ఉట్టిపడే దుస్తులతో, పలకరింపులతో సభను ఓ గలగలా పారుతున్న గోదావరిలాగా చేసేసారు. కార్యక్రమం గణేశ ఆరాధనతో మొదలైంది.

తరువాత పిల్లలు పెద్దలు పాటలు నృత్యాలతో ప్రేక్షకుల ను అలరింపజేశారు. అటు సాంప్రదాయబద్దంగా ఉన్నా పాటలు నృత్యాలతో పాటు ఇప్పుడు వస్తున్నా సినిమా పాటలు ఆటలు కూడా ఉండడం కార్యక్రమం అందరికి నచ్చేలా చేసింది.

మొట్టమొదటి సారిగా టాంపా తెలుగు సంఘం 'తెలుగు సాహితి' వార్షిక పత్రిక డాక్టర్ దేవయ్య చేతుల మీదుగా వెలువరించడం ఒక హైలైట్. ఈ సంచికలో మెత్తం టాంపా వాసులే కథలు కవితలు వ్రాయడం బొమ్మలు వేయడం గొప్ప విశేషం. ఈ పత్రిక అందంగా అతి కొద్ది వ్యవధిలో వెలువర్చడం వెనుక టాంపా వాసుల సాహిత్యాభిమానం కృషి ప్రస్ఫుట మౌతుంది.

కార్యక్రమంలో భాగంగా కమిటీ సభ్యులు సంఘం   స్థాపించిన సభ్యులను పేరు పేరున పిలిచి వేదికగ పైన గౌరవించడం అందరికి నచ్చినట్లు చప్పట్లే చెప్పాయి.

కమిటీ గత సంవత్సర వార్షిక నివేదికను కూడా కార్యక్రమంలో భాగంగా సభ్యులతో పంచుకున్నారు.

అచ్చ తెలుగు విందు భోజసనం తరువాత ప్రేక్షకులకు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న SS థమన్ సంగీత విభావరి ప్రారంభం అయినది. దాదాపు 3 గంటలు జరిగిన ఈ వీనుల విందులో శ్రీకృష్ణ , గీత మాధురి, సమీర, ప్రదీప్, దీపులు పాటలు పాడటం తో పాటు ప్రేక్షకులను అహర్నిశం తమ మాటలతో ఉర్రూతలూగించారు. స్టేజి మీద, స్టేజి బయట కూడా పిల్లలు పెద్దలు హుషారుగా థమన్ సంగీతానికి నృత్యం చేయడం ఆయన పాటలు ప్రజల మధ్య ఎంత హిట్ అయ్యాయో తెలిపాయి. థమన్ కూడా కొన్ని పాటలు పాడడం మరో హైలెట్. 3 గంటల కార్యక్రమం మూడు క్షణాలలాగా గడవడం తో ప్రేక్షకులు అప్పుడే అయ్యిపోయిందా అన్న చిరు బాధతో మంచి కార్యక్రమం చూసామన్న తెగ సంతోషం తో కార్యకర్తలను థమన్ టీమును అభినందించడం తో ఆ రోజు ఆనందంగా ముగిసింది.

దాదాపు 2 వేల దాక ఉన్న ప్రజలకు ఇలాంటి ఓ మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం ఈవెంట్ మేనేజర్, మంది మార్బలం, డబ్బులు ఉంటె కాని సాద్యం కాదు. కాని టాంప బే తెలుగు సమితి కమిటీ సభ్యులు తమ సమయం వెచ్చించి, తమ కుటంబ వ్యక్తులను స్నేహితులను  టాంపా బే లో ఉన్న ఉత్సాహవంతులను ప్రోగు చేసి ఒంటి త్రాటి మీద నడపడం వల్లే సాధ్యమయింది . ఉగాది కాకుండా, దీపావళి సంక్రాంతి పడుగాలు, పిక్నిక్లు పిల్లలకు పోటీలు ఇంకా అనేక మనోరంజక కార్యక్రమాలు చేయడం ఎంతో సంతోషదాయకం . సంఘం లో తమ భాద్యత విస్మరించకుండా చెన్నై వరద బాదితులకు విరాళాలు సేకరించడం, పేదవారి ఇండ్లు కట్టడానికి శ్రమ దానం చేయడంలో కూడా ఈ కమిటీ సభ్యులు పాటుపడ్డారు. నీరజ జాస్తి అధ్యక్షత న ఈ కమిటీలో భానుప్రకాష్(ఉపాదక్ష్యులు) శ్రీనివాస కొమ్మినేని(సెక్రెటరి) ప్రహ్లాద మాడభూషి (జాయింట్ సెక్రెటరి) గాంధి నిడదవోలు (కోశాధికారి) చందు తల్ల (పబ్లిక్ రిలేషన్స్) శివ పంగులూరి (భోజనం) అనిల్ మాండవ (వెబ్) మాలిని తంగిరాల (ఫైనాన్సు) శ్యాం తంగిరాల (సాంస్కృతిక) చేసిన కృషి అభినదనీయం, ఆదర్శదాయకం. 

 

Tags :