ASBL NSL Infratech

ఏపీలో పయొనీరింగ్ పెట్టుబడులు

ఏపీలో పయొనీరింగ్ పెట్టుబడులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పయొనీరింగ్‌ వెంచర్స్‌ సంస్థ సముఖత వ్యక్తం చేసింది. ప్రపంచ ఆర్థిక వేదిక ఆహ్వానం మేరకు నాలుగు రోజుల దావోస్‌ పర్యటనకు వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదట జ్యురిక్‌ చేరుకున్నారు. అక్కడ పయొనీరింగ్‌ వెంచర్స్‌ సంస్థ చైర్మన్‌ రాన్‌పాల్‌, చీఫ్‌ ఇన్వెస్టర్‌ ఆఫీసర్‌ సందీప్‌రాజ్‌తో ద్వైపాకిక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు సమగ్ర ప్రణాళికతో రావాలని, అన్ని విధాల సహకరిస్తామని చంద్రబాబు తెలిపారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థ(ఎఫ్‌పీఓ) తరహాలో పాల ఉత్పత్తులకు అదనపు విలువ జోడించేలా పెద్ద ఎత్తున సహకార సంస్థల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. కుప్పంలో చిన్న విమానాశ్రయం ఏర్పాటు చేస్తున్నామని, దీని వల్ల సరకు రవాణా  సులువవుతుందని వివరించారు.

ఆహారశుద్ధి రంగంలో పెట్టుబడులు పెట్టండని ముఖ్యమంత్రి కోరారు. పండ్ల తోటలు, పాడి పరిశ్రమల ఇప్పటికే తమ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టిందని, ఐదేళ్లలో మరో రూ. ఐదు వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నామని రాన్‌పాల్‌ తెలిపారు. గ్రామీణ భారతంలో ఎక్కువ  పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పంతో పాటు మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఇప్పటికే తమ సంస్థ కార్యాకలాపాలు ప్రారంభించిందని వివరించారు. రూ.వెయ్యి కోట్ల వరకు పెట్టుబడులు పెట్టామని తెలిపారు.

Tags :