ASBL NSL Infratech

వైఎస్ జగన్ తో ప్రత్యేక హోదా సాధన సమితి నేతల భేటీ

వైఎస్ జగన్ తో ప్రత్యేక హోదా సాధన సమితి నేతల భేటీ

హాజరైన చలసాని శ్రీనివాస్, తాడి నరేష్, కొండా నర్సింగరావు.. శర్మ, సదాశివరెడ్డి, అప్పలనాయుడు, మల్లికార్జున్. వైఎస్ జగన్ పోరాటాన్ని ప్రశంసించిన హోదా సాధన సమితి నేతలు. మొదటి నుంచి మీరు ఒకే మాటపై నిలబడి.. ప్రత్యేక హోదాను సజీవంగా ఉంచారని ప్రశంసలు. అన్ని రాజకీయ పక్షాలు, సంఘాలను కలుపుకొని.. హోదా పోరాటానికి నాయకత్వం వహించాలని కోరిన నేతలు. ఢిల్లీ వెళ్లి ఆమరణ దీక్షలో పాల్గొనే ఎంపీలకు.. సంఘీభావం తెలుపుతామని వైఎస్ జగన్‌కు తెలిపిన హోదా సాధన సమితి నేతలు.

హోదాపై ఇప్పటికే కార్యాచరణ ప్రకటించాం.. 
త్వరలో మరోసారి సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చిద్దాం:
హోదా సాధన సమితి నేతలతో వైఎస్ జగన్. చంద్రబాబు కేంద్రాన్ని అడగకపోవడం వల్లే హోదా రాలేదు.
ఒక వేళ చంద్రబాబు అడిగిఉంటే హోదా వచ్చేది: వైఎస్ జగన్
ప్రత్యేక హోదాకు కేబినెట్ ఎప్పుడో ఆమోదం తెలిపింది
ప్లానింగ్ కమిషన్‌ను చంద్రబాబు కలిస్తే హోదా వచ్చేది: వైఎస్ జగన్
ప్రస్తుతం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లింది హోదా కోసం కాదు..
ప్రజలను మరోసారి మభ్యపెట్టాలని చంద్రబాబు చూస్తున్నారు: వైఎస్ జగన్
హోదా కోసం పోరాడే వారందరికీ వైఎస్‌ఆర్ సీపీ అండగా ఉంటుంది
హోదా ఉద్యమకారులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి: వైఎస్ జగన్

 

Tags :