ASBL NSL Infratech

న్యూజెర్సిలో 7వ అమెరికా తెలుగు సంబరాలు

న్యూజెర్సిలో 7వ అమెరికా తెలుగు సంబరాలు

అతిధులు... సినిమా సంగీత విభావరులు, సాహిత్య గోష్టుల సందడి...

న్యూజెర్సిలోని ఎడిసన్‌లో ఉన్న న్యూజెర్సి కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పొజిషన్‌ సెంటర్‌లో మే 26 నుంచి 28 వరకు అంగరంగ వైభవంగా జరిగే 7వ అమెరికా తెలుగు సంబరాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండేళ్ళకోమారు నాట్స్‌ నిర్వహించే అమెరికా తెలుగు సంబరాలకు ఈసారి న్యూ జెర్సి వేదికగా నిలిచింది. తెలుగురాష్ట్రాల నుంచి ఎంతోమంది ప్రముఖులు ఈ సంబరాల్లో పాల్గొనేందుకు న్యూ జెర్సి వచ్చారు. తెలుగు ఆట... తెలుగు పాట సంబరాలతో హోరెత్తనున్న ఈ సంబరాల్లో సినీ తారలు కూడా అట్రాక్షన్‌ కానున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరిని అలరిందించేందుకు సంబరాల కమిటీ అనేక కార్యక్రమాలను నిర్వహించనుంది. కమ్మని రుచులతో వచ్చినవారికి వడ్డించేందుకు తెలుగింటి వంటకాలను కూడా నాట్స్‌ ఫుడ్‌ కమిటీ సిద్ధం చేసింది. కళా ప్రదర్శనలతో పాటు  ఔత్సాహిక వ్యాపారవేత్తలకోసం బిజినెస్‌ సెమీనార్లు తెలుగు భాషను అభిమానించే వారికోసం సాహిత్య వేదికలను నాట్స్‌ సంబరాల కమిటీ సిద్ధం చేసింది. మహిళలకోసం ప్రత్యేక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసింది. ప్రతి రెండేళ్లకు ఒక్కసారి నాట్స్‌ నిర్వహించే అద్భుత కార్యక్రమం కావడంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సంబరాల నాయకత్వ కమిటీ అన్నీ కమిటీలతో కలిసి సమీక్షలు నిర్వహించి ఏర్పాట్లను పూర్తి చేసింది.  

నాట్స్‌ సంబరాల్లో హైలైట్‌గా పలు కార్యక్రమాలు నిలవనున్నాయి. పేరెంట్స్‌ మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమం సంబరాలకే హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. మన తల్లితండ్రులను మనం గౌరవించుకునేలా ఈ కార్యక్రమం ఉంటుంది. అమెరికాలో నాట్స్‌ తెలుగమ్మాయి పేరుతో ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా టీన్‌ నాట్స్‌ ముద్దుగుమ్మ, మిస్‌ నాట్స్‌ కిన్నెరసాని, మిసెస్‌ నాట్స్‌ కావ్యనాయకి పేరుతో పోటీలను ఏర్పాటు చేశాము. ఈ వివిధ నగరాల్లో జరిగే పోటీల్లో విజేతలుగా నిలిచినవారు అమెరికా తెలుగు సంబరాల వేదికపై గ్రాండ్‌ ఫైనల్‌ పోటీల్లో తలపడుతారు. గెలిచిన వారికి ప్రతి కేటగిరిలో నాట్స్‌ కిరీటంతో పాటు నగదు బహుమతులు ఇస్తున్నారు.

సంగీత దర్శకులు మణిశర్మ, థమన్‌లు తమ సంగీతంతో నాట్స్‌ సంబరాల్లో ప్రేక్షకులను అలరించనున్నారు. ఎలిజియం బ్యాండ్‌ కూడా సంగీతంతో యువతను ఊర్రూతలూగించనున్నది.

Click here for Photogallery

 

NATS Sambaralu Program Schedule

 

 

Tags :