ASBL NSL Infratech

"ఆటా" వాలీ బాల్ - త్రో బాల్ పోటీలు విజయవంతం

"ఆటా" వాలీ బాల్ - త్రో బాల్ పోటీలు విజయవంతం

అమెరికా తెలుగు సంఘం (ఆటా) అధ్యక్షులు భువనేష్ బుజాల, కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు మరియు అన్ని కమిటీల సభ్యులు అత్యంత ప్రతిష్టాంతంకంగా అమెరికా రాజధాని నగరం నడిబొడ్దున వాషింగ్టన్ డి సి లో మూడు రోజులపాటు జూలై 1-3,2022 జరగనున్న ఆటా 17వ మహాసభలను పెద్ద ఎత్తున 15,000 పైగా హాజరయ్యె విధంగా సన్నాహాలు చేస్తున్నారు.

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పద్మవిభూషణ్ జగ్గీ వాసుదేవ్ (సద్గురు), "Daaji" కమలేష్ పటేల్, ప్రముఖ కవులు, కళాకారులు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు విజయ్ దేవరకొండ, "DJ Tillu" సిద్దు, రకుల్ ప్రీత్ సింగ్,  ప్రగ్యా జైస్వాల్, 1983 WorldCup Team కపిల్ దేవ్ & గవాస్కర్, సంచలనం స్రుష్టిస్తున్న గాయకుడు రాం మిరియాల, Singer మంగ్లీ, Melody King ఎస్ఎస్ థమన్ మరియు ప్రముఖ సంగీత దర్శకుడు పద్మవిభూషణ్ ఇళయరాజా సంగీత విభావరి ఏర్పాటు చేస్తున్నారు. 

ఆటా ప్రత్యేకంగా వాషింగ్టన్ డి సి, మేరిల్యాండ్ & వర్జినీయా రాష్ట్రాలలో వుంటున్న తెలుగు వారందరిని ప్రోత్చహించటం కోసం వివిధ Sports Competitions పురుషులకు మరియు మహిళలకు నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందె,  పోటీలలో భాగంగా మే 7, శనివారం రోజు న వర్జీనియాలో పురుషులకు వాలీ బాల్, మహిళలకు త్రో బాల్ & వాలీ బాల్ పోటీలను విజయవంతంగా నిర్వహించింది. ఈ పోటీలకు USA నలుమూలల నుండి అద్భుతమైన స్పందన లభించింది, ఇతర రాష్ట్రాల నుండి కూడా అనేక జట్లు పాల్గొనేందుకు వచ్చాయి. టీమ్ షో స్టాపర్లు డివిజన్ 1 వాలీ బాల్ పురుషులను గెలుచుకోగా, కంట్రీ ఓవెన్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. డివిజన్ 2లో, సూపర్ స్ట్రైకర్స్ జట్టు టైటిల్ గెలుచుకోగా, VASH vacations 2వ స్థానంలో నిలిచాయి. మహిళల విభాగంలో నార్త్ కరోలినా నుండి వచ్చిన స్పోర్టి దివాస్ డివిజన్ 1 త్రో బాల్ పోటీలో గెలుపొందగా, VA రాకర్స్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. డివిజన్ 2లో రిచ్‌మండ్ స్మాషర్లు గెలిచారు మరియు షార్లెట్ స్ట్రైకర్లు 2వ స్థానంలో నిలిచారు. గెలుపొందిన జట్లకు ఆటా అధ్యక్షుడు భువనేష్ భుజాల బహుమతులు అందజేసి, ప్రతి ఒక్కరూ ఇదే ఉత్సాహంతో సదస్సు వరకు వరుసలో ఉన్న అన్ని క్రీడలు మరియు కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆటా కన్వెన్షన్ కన్వీనర్ సుధీర్ బండారు విజేతలందరినీ అభినందించారు మరియు ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు ఆటా కన్వెన్షన్ స్పోర్ట్స్ టీమ్ మరియు వాలంటీర్లకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి హాజరైన ఆటా కాన్ఫరెన్స్ నిర్వహకులు శ్రవణ్ పాడూరు, రవి బొజ్జ, అమర్పాశ్య,  కౌశిక్ సామ, ఆటా 17వ మహసభల కు Co-Host గా వ్యవహారిస్తున్న రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (CATS) అధ్యక్షులు సతీష్ వద్ది మరియు ఇతరులు హాజరై మాట్లాడుతూ జులై 1,2 & 3 న వాషింగ్టన్ DC లో జరగబోయే 17వ ఆటా కాన్ఫరెన్స్ మరియు యూత్ కన్వెన్షన్ కి ఇధే ఉత్సాహంతో పాల్గోని జయప్రదం చేయవలసిందిగా కోరారు.

ఈ కార్యక్రమాన్నిస్పోర్ట్స్ చైర్ సుధీర్ దామిడి, స్పోర్ట్స్ కో-ఛైర్ శ్రీధర్ బండి, మహిళా స్పోర్ట్స్ చైర్ శీతల్ బొబ్బ, మహిళా స్పోర్ట్స్ కో-ఛైర్‌ ప్రశాంతి ముత్యాల ఘనంగా నిర్వహించారు. 

ఆటా 17వ మహాసభల మరిన్ని వివరాలకు www.ataconference.org చూడండి.


Click here for Event Gallery

 

Tags :