ASBL NSL Infratech

వర్జీనీయాలో విజయవంతంగా "ఆటా" క్రికెట్ పోటీలు

వర్జీనీయాలో విజయవంతంగా "ఆటా" క్రికెట్ పోటీలు

వాషింగ్టన్ డీసి లో జులై 1వ తేది నుండి 3వ తేది వరకు జరగనున్ననటువంటి ఆటా 17వ కన్వెన్షన్ మరియు యూత్ కాన్ఫరెన్స్ సందర్భంగా, ఆటా కన్వెన్షన్ టీం వారి ఆద్వర్యంలో మే28వ తేదిన విజయవంతంగా క్రికెట్ పోటీలు నిర్వహించబడ్డాయి. మొత్తం 12 జట్లు పాలుపంచుకున్నటువంటి ఈ టోర్నిని నాలుగు గ్రూపులుగా విభజించి ప్రతీ గ్రూప్ లోని 3 జట్లతో ఈ పోటీలను నిర్వహించారు. ప్రతీ గ్రూప్ లో మొదట రెండు స్థానాల్లో నిలిచినటువంటి జట్లు ప్లేఆఫ్ కు అర్హత సాధించాయి.

హక్ష్-యేఐడబ్ల్యు జట్టు ఏసి/డీసి జట్టు పై విజయం సాధించి సెమిస్ నుండి ఫైనల్ కు చేరింది. వార్ రేంజర్స్- యుసిసి జట్టు డీసిసి జట్టు పై విజయం సాందించి సెమిస్ నుండి ఫైనల్ కు చేరింది. ఆద్యాంతం ఉత్ఖంఠభరితంగా జరిగనటువంటి ఫైనల్ మ్యాచ్ లో హక్ష్-యేఐడబ్ల్యు జట్టు విజయం సాదించి 2022 ఆటా ఛాంపియన్ షిప్ ని కైవసం చేసుకున్నారు.

మొదట టాస్ గెలిచిన హక్ష్-యేఐడబ్ల్యు జట్టు ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకుని ప్రత్యర్ధి జట్టుని 60 పరుగులకు కట్టడి చేయగలిగారు.

వార్ రేంజర్స్- యుసిసి జట్టు 10 ఒవర్స్ లొ 6 వికెట్ల నస్టానికి 60 పరుగులు చేసింది.

61 పరుగుల విజయలక్ష్యంతొ బరిలొకి దిగినటువంటి హక్ష్-యేఐడబ్ల్యు జట్టు 9.4 వొవర్స్ లో 5 వికెట్లను కోల్పోయి విజయం సాంధించింది.

క్లెమెంట్ తన అత్యత్భుత బ్యాటింగ్ నైపున్యంతో 25  బంతులలో 32 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పొషించి మ్యాన్ ఆఫ్ మ్యచ్ గా నిలిచాడు.

కేవలం ఒక్కరొజులోనే ఉదయం 7:30 నుండి రాత్రి 10:30 వరకు ఈ పొటీలను ఆటా కన్వెన్షన్ మరియు యూత్ కాన్ఫరెన్స్ వారు  విజయవంతంగా నిర్వహించారు. ఎంతో ఉల్లాసంగా ఈ  పొటీలలో పలుపంచుకున్నటువంటి జట్లకు మరియు సహకరించినటువంటి మిత్రులకు ఆట కన్వెన్షన్ మరియు యూత్ కాన్ఫరెన్స్ నిర్వహకులు స్పోర్ట్స్ చైర్ సుధీర్ దామిడి, మహిళా స్పోర్ట్స్ చైర్ శీతల్ బొబ్బ మరియు, వెండొర్ బూత్ కమిటి చైర్ కౌశిక్ సామ ప్రత్యేక ధన్యవాదలు తెలియజేసారు.

ఈ టోర్నమెంట్ లో చందు (వార్ రేంజెర్- యుసిసి) బెస్ట్ బ్యాట్స్ మెన్ 
ప్రసన్న (వార్ రేంజెర్- యుసిసి )- బెస్ట్ బౌలర్
మురళి మాచిరాజు(హక్ష్-యేఐడబ్ల్యు) బెస్ట్ ఆల్రౌండర్ గా నిలిచారు.

సెంటెర్విల్లె, హెరండొన్, రెస్టొన్, మరియు డుల్లెస్ గ్రౌండ్స్ లొ ఈ పొటీలు నిర్వహించబడ్డయి.

కాన్ఫరెన్స్ టికెట్స్ వివరాలు:

అమెరికా తెలుగు సంఘం(ఆటా) 17వ మహాసభలు అందరి తెలుగు వారి పండుగ కావున అమెరికా రాజధాని నగరం నడిబొడ్డున వాషింగ్టన్ డి సి లో మూడు రోజుల పాటు మహాసభలకు 15,000 పైగా హాజరయ్యే విధంగా న భూతో న భవిష్యతి లాగా నిర్వహించటానికి  పద్మవిభూషణ్ సద్గురు, విజయ్ దేవరకొండ, డిజె టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ,  రకుల్ ప్రీత్ సింగ్, రామ్ మిర్యాల, మంగ్లీ, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, క్రిస్ గేల్, GMR, ఉపాసన కొణిదెల, Dr. MSN Reddy, ప్రముఖ కవులు, కళాకారులు, సినీ ప్రముఖులు, మరియు తెలుగు రాష్ట్రాల నుండి అనేక మంది రాజకీయ నాయకులు విచ్చేస్తున్న ఈ మహాసభలకు అమెరికా లో వున్న తెలుగువారందరూ హాజరై భారీ స్థాయిలో విజయవంతం చేయాలని June 15, 2022 వరకు 50% off Early Bird Discounted Price ఇవ్వటం జరుగుతుంది.

Buy the Tickets: https://tinyurl.com/yv3u7xd8

Visit: https://www.ataconference.org/

 

Click here for Photogallery

 

 

Tags :