ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఆటా బిజినెస్ సెమినార్ కు ప్రముఖులు

ఆటా బిజినెస్ సెమినార్ కు ప్రముఖులు

అమెరికా తెలుగు సంఘం (ఆటా) కాన్ఫరెన్స్‌లో భాగంగా నిర్వహించే బిజినెస్‌ సెమినార్‌లకు అనేకమంది ప్రముఖులు వస్తున్నారు. అమెరికాలోని కమ్యూనిటీకి ఉపయుక్తమయ్యేలా ఈ సెమినార్‌లను ఏర్పాటు చేశారు. జూలై 2వ తేదీ మధ్యాహ్నం 1 గంట నుంచి 2.30 గంటల వరకు ఎంట్ర ప్రెన్యూరిజం, నాయకత్వం అంశంపై ఓ చర్చాగోష్టిని ఏర్పాటు చేశారు. ఇందులో జిఎంఆర్‌ గ్రూపు కంపెనీల అధినేత గ్రంథి మల్లిఖార్జునరావు, నాస్‌కామ్‌ పాస్ట్‌ చైర్మన్‌, సియంట్‌ కంపెనీ అధినేత బివిఆర్‌ మోహన్‌ రెడ్డి, భారత సంతతి రాయబారి వినయ్‌ తుమ్మలపల్లి, మేరీలాండ్‌ డెలిగేట్‌ అరుణ మిల్లర్‌ పాల్గొంటున్నారు.

మధ్యాహ్నం 2.30 నుంచి డూయింగ్‌ బిజినెస్‌ విత్‌ యుఎస్‌ గవర్నమెంట్‌ అనే అంశంపై సెమినార్‌ జరగనున్నది. ఇందులో హార్దిక్‌ భట్‌ (సిఐఓ, ఇల్లినాయిస్‌), రామ్‌ మూర్తి (సిఐఓ, యుఎస్‌ ఫెడరల్‌ ఏజెన్సీ), జే చల్లా (సిఇఓ, గవర్నమెంట్‌ కాంట్రాక్టర్‌), జగ్‌ ఖొట్టా (జిఎంఎస్‌ క్వాలిటీ), అదేరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ట్యాక్స్‌ల విషయంపై ఓ ప్రజంటేషన్‌ జరుగుతుంది. ఇందులో రావు గరుడ పాల్గొంటున్నారు.  జూలై 3వ తేదీ ఉదయం 10 నుంచి 12 వరకు తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చా కార్యక్రమం జరుగుతుంది. ఇందులో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల డిప్యూటీ ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. అదేరోజు మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు బిజినెస్‌ ఐడియా కాంపిటీషన్స్‌ జరుగుతాయి. ఇందులో విజేతలైనవారికి నగదు పురస్కారాన్ని అందజేస్తారు.

 

Tags :