ASBL NSL Infratech

స్విట్జర్లాండ్ చేరుకున్న సీఎం చంద్రబాబు బృందం

స్విట్జర్లాండ్ చేరుకున్న సీఎం చంద్రబాబు బృందం

దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం జ్యూరిచ్‌ చేరుకుంది. పర్యటనలో భాగంగా జ్యూరిచ్‌- అమరావతి నగరాల మధ్య సిస్టర్‌ సిటీ ఒప్పందం, హిటాచీ సంస్థ, ఫ్రాన్‌హోఫర్‌ అసోసియేషన్‌తో మూడు వేర్వేరు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. పలు అంతర్జాతీయ సంస్థల సీఈవోలు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులతో సమావేశం కానునున్నారు.

23వ తేదీన ఏపీ లాంజ్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ కాన్నును. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ఆహార భద్రత- వ్వవసాయ రంగం భవిష్యత్తు, ఏపీలో సహజసాగు విధానాల ద్వారా వ్వవసాయంలో తీసుకొచ్చే మార్పులు తదితర అంశాలపై చంద్రబాబు ప్రసంగించనున్నారు.

మంత్రులు యనమల రామకృష్ణుడు, నారా లోకేష్‌, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌, వ్వవసాయ సలహాదారు విజయ్‌కుమార్‌, ఈడీబీ సీఈవో కృష్ణకిషోర్‌, ఉన్నతాధికారులు సాయిప్రసాద్‌, సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌ తదితరులు ముఖ్యమంత్రి బృందంలో ఉన్నారు. ఈ బృందం నాలుగు రోజుల పాటు అక్కడ పర్యటించి ఈ నెల 26న అమరావతికి తిరిగి రానుంది.

Tags :