ASBL NSL Infratech

పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం : చంద్రబాబు

పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం  : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో అవకాశాలు, సహజవనరులు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విశాలమైన తీర ప్రాంతం, పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉన్నందున తరలిరావాలని కోరారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భాగంగా ఆయన వివిధ సంస్థల ప్రతినిధులను, పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. పారిశ్రామికాభివృద్ధికి ఏకగవాక్ష విధానంలో మూడు వారాల్లోనే అన్ని రకాల అనుమతులు ఇస్తున్నామని వెల్లడించారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో ఐవోటీ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న విధానం, సీఎం కోర్‌ డ్యాష్‌ బోర్డు పనితీరును వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు 20 చైనా కంపెనీలు ముందుకు వచ్చాయి. అమరావతికి ఆర్థిక వనరులు, పెట్టుబడులు సమకూర్చడంలో మెకెన్సీ గ్లోబల్‌ ముఖ్య భూమిక పోషించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిలషించారు. ఇందుకోసం సంస్థలోని ప్రతిభావంతులతో ఒ బృందాన్ని ఏర్పాటు చేసి, తమ రాష్ట్రానికి పెట్టుబడులు సమకూర్చే బాధ్యతను ఆ బృందానికి అప్పగించాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ సందర్భంగా జోనాథన్‌ ఓజల్‌ మాట్లాడుతూ అంతర్జాతీయ వాణిజ్యంలో  భవిష్యత్తు అంతా భారత్‌, చైనా దేశాలదేనని అన్నారు. ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిలో 25శాతం ఈ రెండు దేశాల నుంచి వస్తుందని,  సాంకేతికత కూడా ఈ ఉభయదేశాలదే ఉంటుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌కు చైనా పెట్టుబడుల రాకను సులభతరం చేసే బాధ్యతను తాను తీసుకుంటానని తెలిపారు. రానున్న మూడు మాసాలలో చైనా నుంచి 20 ప్రధాన వాణిజ్య, పారిశ్రామిక సంస్థలను రాష్ట్రానికి తీసుకురావడంలో తోడ్పాడతామని తెలిపారు.


Click here for Photogallery

 

Tags :