ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

'వైఎస్సార్ కంటి వెలుగు' భేష్

'వైఎస్సార్ కంటి వెలుగు' భేష్

'సర్వేంద్రియాణాం.. నయనం ప్రధానం' అన్నారు. చూపు సమస్యను నిర్లక్ష్యం చేయొద్దని దీని అర్థం. ఈ విషయం తెలిసినా చాలా మంది వివిధ కారణాల వల్ల నిర్లక్ష్యం చేస్తుంటారు. పేదరికం వల్ల చాలా మంది కంటి పరీక్షలు చేయించుకోవడానికి వెనకాడుతుంటారు. ఈ విషయాన్ని సీరియస్‌గా గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 'వైఎస్సార్‌ కంటి వెలుగు' పథకాన్ని తీసుకొచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వ ముందు చూపు లక్షలాది మంది చిన్నారుల కళ్లలో వెలుగు నింపుతోంది. కంటిచూపు మందగించినా, అక్షరాలు మసక మసకగా కనిపించినా.. సమీపంలో డాక్టరు లేక, ఉన్నా వైద్యానికి ఖర్చు చేయలేక అలాగే ఉండిపోయి ఇబ్బందులు పడుతున్న ఎందరో చిన్నారులకు వైఎస్సార్‌ కంటి వెలుగు పథకం వరంగా మారింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు..60,668 స్కూళ్లలో 69,43,052 లక్షల మంది చిన్నారులకు ఈ పథకం కింద కంటి పరీక్షలు నిర్వహించి, సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కారం చూపే దిశగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అడుగులేస్తోంది.

రాష్ట్రంలో వైఎస్సార్‌ కంటి వెలుగు పథకం మహోద్యమంలా సాగుతో ఇప్పటివరకు 2,12,024 మంది బాలికలకు, 2,18,898 మంది బాలురకు కంటి సమస్యలు ఉన్నట్టు తేలింది. మొత్తంగా బాలురలోనే ఎక్కువ కంటి సమస్యలు ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. వీరిలో పెద్ద పెద్ద సమస్యలున్న చిన్నారులందరికీ బోధనాసుపత్రిలో మెరుగైన వైద్యం (శస్త్రచికిత్స) చేయించి, ఉచితంగా కళ్లజోడు ఇచ్చేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పథకం అమలులో ప్రభుత్వ వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు, ఉపాధ్యాయులు, ఆరోగ్యశాఖ అధికారులు ఇలా ఎంతోమంది భాగస్వాములయ్యారు. మొత్తం ఆరు దశల్లో జరిగే కార్యక్రమంలో త్వరలోనే పెద్దవారికీ కూడా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా అద్దాలు పంపిణీ చేస్తారు.

 

 

Tags :