అమెరికాలో కొత్త వైరస్
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మహమ్మారి ప్రస్తుతం అదుపులోనే ఉంది. భారత్‌లో రోజువారి కొత్త కేసుల్లో పెరుగుదల లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకుంటున్నారు. దీంతో ప్రజలు సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నారు.తాజాగా అమెరికాలో మరో కొత్త వేరియంట్‌ను అధికారులు గుర్తించారు. కొవిడ్ 19కి చెందిన అత్యంత పరివర్తన చెందిన కొత్త వేరియంట్‌ను గుర్తించినట్లు అమెరికాకు చెందిన వ్యాధి నియంత్రణ కేంద్రం తెలిపింది. ఈ వేరియంట్‌కు బీఏ.2.86గా పేరు పెట్టినట్లు పేర్కొంది. ఈ కొత్త వేరియంట్ అమెరికాతో పాటు ఇజ్రాయెల్, డెన్మార్క్ దేశాల్లో కూడా వెలుగులోకి వచ్చినట్లు తెలిపింది. కొవిడ్-19కి చెందిన కొత్త వేరియంట్‌ను కనుగొన్నాం. దీనికి బీఏ.2.86 అని పేరు పెట్టాం. ఈ కొత్త వైరస్ యునైటెడ్ స్టేట్స్, డెన్మార్క్, ఇజ్రాయెల్‌లో కనుగొనబడిరది. కొత్త వేరియంట్‌కు చెందిన పూర్తి సమచారాన్ని సేకరిస్తున్నాం అని అమెరికా వ్యాధి నియంత్రణ కేంద్రం తెలిపింది.