ASBL NSL Infratech

కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేస్తే.. తాను రాజీనామా

కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేస్తే.. తాను రాజీనామా

కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు అమలు చేస్తే తాను రాజీనామాకు సిద్ధమని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు స్పష్టం చేశారు. సిద్దిపేటలో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ  నాకు పదవులు కాదు, రైతుల ప్రయోజనాలు ముఖ్యం. నాడు ఓటుకు నోటు, నేడు దేవుళ్లపై ప్రమాణాలు చేస్తున్నారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ అమలు చేస్తారో లేదో చెప్పాలి. హామీలు అమలయ్యే వరకూ పోరాటం చేస్తూనే ఉంటా. సిద్ధిపేట జిల్లాను తొలగిస్తామని సీఎం చెబుతున్నారు. జిల్లాలు ఉండాలంటే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి అని పిలుపునిచ్చారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :