ASBL NSL Infratech

డ‌బుల్ జాక్ పాట్ కొట్టేసిన ర‌ష్మిక‌

డ‌బుల్ జాక్ పాట్ కొట్టేసిన ర‌ష్మిక‌

పుష్ప సినిమాతో శ్రీవ‌ల్లిగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది ర‌ష్మిక మంద‌న్నా. కానీ ర‌ష్మిక‌కు బాలీవుడ్ లో మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం యానిమ‌ల్‌నే. ప్రేమ తో హింసించే భ‌ర్తను భ‌రించే ఆధునిక ప్రియురాలిగా సందీప్ వంగా త‌న‌కిచ్చిన షేడ్స్ ను ఎంతో గొప్ప‌గా చేసి ఆడియ‌న్స్ ను మెప్పించింది. అంతకు ముందు కొన్ని సినిమాలు చేసిన‌ప్ప‌టికీ అవేమీ ర‌ష్మికకు అనుకున్నంత  గుర్తింపు తీసుకుని రాలేక‌పోయాయి.

అయితే ఇప్పుడు ర‌ష్మిక‌కు బాలీవుడ్ లో ఓ బంప‌రాఫ‌ర్ ద‌క్కింద‌ని తెలుస్తోంది. కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ స‌ర‌స‌న ర‌ష్మిక జోడీ క‌ట్టేందుకు ఛాన్స్ కొట్టేసింద‌ని లేటెస్ట్ అప్డేట్. అది కూడా మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌బోయే సికంద‌ర్ సినిమా కోసం. ఈ సినిమా జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నుంది. సాజిద్ న‌డియాడ్ వాలా ఈ సినిమాను భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

ముందు మురుగ‌దాస్, స‌ల్మాన్ తో కిక్ 2 తీయాల‌నుకున్నాడు కానీ ఆ క‌థ సెట్ అవ‌క‌పోవ‌డంతో కొత్త లైన్ ను చెప్పి గ్రీన్ సిగ్న‌ల్ తెచ్చుకున్నాడు. గ‌త కొంత కాలంగా బాలీవుడ్ ఇండ‌స్ట్రీకి దూరంగా ఉన్న మురుగ‌దాస్ మ‌ళ్లీ ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాల‌ని చూస్తున్నాడు. ర‌ష్మిక ఎంట్రీ గురించి ఇంకా అఫీషియ‌ల్ అనౌన్స్మెంట్ రాలేదు. కానీ ఆల్మోస్ట్ క‌న్ఫ‌ర్మే అంటున్నారు. ఇదే నిజ‌మైతే ర‌ష్మిక డ‌బుల్ జాక్ పాట్ కొట్టిన‌ట్టే.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :