ASBL NSL Infratech

టిటిఎ వారి అష్టావధానం

టిటిఎ వారి అష్టావధానం

తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టిటిఎ) ఆధ్వర్యంలో సియాటెల్‌లో నిర్వహించే మెగా కన్వెన్షన్‌ కార్యక్రమాల్లో భాగంగా సాహితీ ప్రియులకోసం అష్టావధానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సంస్కృతాంధ్ర ద్విశతావధాని, అవధాన బ్రహ్మఙ శ్రీ పాలడుగు శ్రీచరణ్‌ అష్టావధానాన్ని మే 25వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సభా సంచాలకులుగా సినీనటులు, దర్శకులు, గీత రచయిత డా. వడ్డేపల్లి కృష్ణ వ్యవహరిస్తున్నారు. వృచ్ఛకులుగా తల్లాప్రగడ రామచంద్రరావు, శ్రీమతి మాధురి ఇంగువ, మల్లిక్‌ బులుసు, సందీప్‌ పొక్కునూరి, డా. కొండపల్లి నీహారిణి, శ్రీనివాస్‌ గూడురు, శ్రీమతి రాజేశ్వరి బుర్రా, సుధాకర్‌ ఉప్పల ఉన్నారు. లిటరరీ, సావనీర్‌ కమిటీ చైర్‌ శ్రీనివాస్‌ గూడురు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. సియాటెల్‌లో మే 24 నుంచి 26 వరకు టిటిఎ మెగా కన్వెన్షన్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :