ASBL NSL Infratech

అలా జరిగితే కేంద్రంపై... ఆధారపడాల్సిన పరిస్థితి : కేటీఆర్

అలా జరిగితే కేంద్రంపై... ఆధారపడాల్సిన పరిస్థితి  : కేటీఆర్

బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని ప్రయత్నిస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అలా జరిగితే చిన్న పనుల కోసం కేంద్రంపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుందని, అభివృద్ధి ఆగిపోతుందని అన్నారు. కేంద్రంలో ఉన్న సవతి తల్లిపై పోరాడాల్సి ఉందన్నారు. కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీకి గులామ్‌గిరీ చేస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, అగ్రవర్ణాల్లో పేదల రిజర్వేషన్ల రద్దుకు కుట్ర జరుగుతోంది. రాజ్యాంగాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీతో పోరాడే పరిస్థితి కాంగ్రెస్‌కు లేదు. కొన్ని చోట్ల కాంగ్రెస్‌ ప్రభుత్వాలను కాషాయ పార్టీ పడగొట్టింది. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూడా పడగొట్టాలని చూశారు. మా ఎమ్మెల్యేలను కొనేందుకు యత్నించారు. తెలంగాణలో వారి ఆటలు సాగలేదు. రాష్ట్రాల్లో ప్రాంతీయ శక్తులు బలంగా ఉండాలి. ఆరు నెలల్లో బీఆర్‌ఎస్‌ తెలంగాణ రాజకీయాలు శాసించే పరిస్థితి వస్తుంది. మోదీతో పోరాటం రాహుల్‌ గాంధీ వల్ల కాదు అని విమర్శించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :