సలార్ క్రేజ్ తట్టుకోవడం కష్టమే..
ప్రస్తుతం ఇండియా వైడ్ ఆదిపురుష్ మానియా నడుస్తోంది. ఎన్నో ట్రోల్స్, అంతగా పాజిటివ్‌గా లేని పబ్లిక్ టాక్‌తో కేవలం మూడు రోజుల్లోనే ఆదిపురుష్ 300 కోట్ల గ్రాస్‌ని కలెక్ట్ చేయడమంటే మాటలు కాదు. రాముడి సెంటిమెంట్ తో పాటూ, ఈ సక్సెస్‌లో ప్రభాస్ స్టార్ క్రేజ్ కూడా సినిమా కలెక్షన్లకు తోడైంది. అంతేకాదు, ఆదిపురుష్ కలెక్షన్లతో ప్రభాస్ రేంజ్ ఏంటన్నది మరోసారి ప్రూవ్ అయింది. ప్రభాస్ ను సరిగా వాడుకునే డైరెక్టర్ దొరకాలే కానీ తన క్రేజ్‌కు రికార్డులు ఏ రేంజ్లో ఉంటాయో ఆదిపురుష్ మూవీ స్పష్టం చేసింది.
రిలీజ్ రోజు, తర్వాత రోజు థియేటర్లలో టికెట్ దొరకని పరిస్థితి ఉందంటేనే డార్లింగ్ క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. డివైడ్ టాక్ ఉన్న ఆదిపురుష్ సినిమాకే ప్రభాస్ ఫ్యాన్స్ ఇంత రచ్చ చేశారంటే ఇక సలార్ సినిమాకు ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ఊహకే అందడం లేదు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ తో ప్రభాస్ ఎన్ని రికార్డులు రాయనున్నాడో చెప్పడం కష్టమే. ఇప్పటికే ఈ సినిమాపై, కాంబోపై మంచి అంచనాలున్నాయి.
జస్ట్ లీకైన ఫోటోనే ఫ్యాన్స్ తెగ ట్రెండ్ చేశారు. పైగా ఈ సినిమాలో గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండవు. యాక్షన్ బ్యాక్ డ్రాప్లో వస్తున్న సలార్ మంచి కమర్షియల్ సినిమాగా రూపొందుతుంది. ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్న సలార్ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
ఆరు నూరైనా ఈ సినిమా చెప్పిన టైమ్ కే వస్తుందని మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. అయితే ఈ సినిమా ఒక భాగం ఉంటుందా లేక కేజీఎఫ్ లా ఫ్రాంచైజీలా ఉంటుందా అనేది తెలియాలంటే మాత్రం రిలీజ్ వరకు ఆగాల్సిందే. మొత్తానికి సలార్ రిలీజ్ కు ఆ సినిమా క్రేజ్ ను తట్టుకోవడం కష్టమనే చెప్పాలి.





