ASBL NSL Infratech

విక్ర‌మార్కుడు2 సాధ్య‌మ‌య్యేనా?

విక్ర‌మార్కుడు2 సాధ్య‌మ‌య్యేనా?

ర‌వితేజ న‌టించిన సినిమాల్లో విక్ర‌మార్కుడు సినిమాకు ప్ర‌త్యేక స్థాన‌ముంది. ఆ సినిమా వ‌చ్చి ఇన్నేళ్ల‌వుతున్నా ఇప్ప‌టికీ ఫ్యాన్స్ కు విక్ర‌మార్కుడు మంచి కిక్కిస్తుంది. ఆ సినిమాకు ఎంత‌టి క్రేజ్ వ‌చ్చిందంటే ప‌లు భాష‌ల్లో విక్ర‌మార్కుడు రీమేక్ అయింది. ఈ సినిమాకు సీక్వెల్ గా విక్ర‌మార్కుడు2 కావాల‌ని ఫ్యాన్స్ ఎప్ప‌టినుంచో డిమాండ్ చేస్తున్న విష‌యం తెలిసిందే.

రీసెంట్ గా విక్ర‌మార్కుడు నిర్మాత ఈ సీక్వెల్ గురించి ప్ర‌స్తావించారు. ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఇప్ప‌టికే క‌థ‌ను రెడీ చేశారని వీలైతే సినిమాను త్వ‌ర‌లోనే తెర‌కెక్కిస్తామ‌న్నారు. ఇదంతా విన‌డానికి బానే ఉంది కానీ ఈ సీక్వెల్ తీస్తే ర‌వితేజ‌తోనే తీయాలి. రాజ‌మౌళి కాకుండా మ‌రే డైరెక్ట‌ర్ తీసినా పోలిక‌ల విష‌యంలో ఎన్నో ఇబ్బందులొస్తాయి.

సంప‌తి నంది డైరెక్ట‌ర్ గా తీసే ప్లాన్ ఉందంటున్నారు కానీ అది కార్య‌రూపం దాల్చ‌డం క‌ష్ట‌మే. గాంజా శంక‌ర్ ఆగిపోయాక సంప‌త్ నంది ఏం చేస్తున్నాడ‌నేది క‌న్ఫ‌ర్మ్ గా తెలీదు. ఓదెల‌2 నిర్మాణ ప‌నుల్లో సంప‌త్ నంది బిజీగా ఉన్నాడు. కాబ‌ట్టి విక్ర‌మార్కుడు2 తెర‌కెక్క‌డం అనుకున్నంత ఈజీ అయితే కాదు. ర‌వితేజను ఒప్పించ‌డంతో పాటూ దాన్ని స‌రిగా హ్యాండిల్ చేసే డైరెక్ట‌ర్ కూడా కావాలి. చూద్దాం ఏం జ‌రుగుతుందో!

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :