తమిళంలో బంపర్ ఆఫర్ కొట్టేసిన తెలుగు డైరెక్టర్..!?

తమిళంలో బంపర్ ఆఫర్ కొట్టేసిన తెలుగు డైరెక్టర్..!?

డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెలుగు ప్రేక్షకులకి ఎంతో దగ్గరైన పేరు. తన మార్క్ సినిమాలతో ఈ దర్శకుడు ఆడియన్స్ ని మెప్పించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మున్నా చిత్రానికి దర్శకత్వం వహించి, ఇప్పటి వారసుడు వరకు ఎన్నో హిట్ సినిమాలని తెలుగు తెరకు అందిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ఈ దర్శకుడి రీసెంట్ సినిమా వారసుడు తెలుగులో ఆశించినంత విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. కానీ తమిళ తంబిలు ఈ చిత్రానికి బ్రహ్మ రథం పట్టరాని చెప్పాలి. దాదాపు మూడు వందల కోట్లు వసూలు వసూలు చేసి కలెక్షన్ల వర్షం కురిపించింది ఈ సినిమా.

హీరో దళపతి విజయ్ ఇమేజ్ కి, క్రేజ్ కి ఏ మాత్రం తీసిపోకుండా వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అందుకే మరోసారి తన కొత్త సినిమాకి స్టోరీ రెడీ చేసుకోమంటూ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ వంశీ పైడిపల్లి కి బంపర్ ఆఫర్ ఇచ్చారని తెలుస్తుంది. ప్రస్తుతం నెట్టింట ఈ వార్త వైరల్ గా మారింది. తెలుగు దర్శకుడు తమిళం లో మరోసారి సూపర్ ఛాన్స్ కొట్టేసాడంటూ వంశీ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. వారీసు సినిమాలో ఇటు మాస్ ఎలిమెంట్స్ ని అటు ఎమోషనల్ సీన్స్ ని చాలా బాగా బాలన్స్ చేసినందుకే ఈ స్టార్ హీరో వంశీ పైడిపల్లికి మరొక అవకాశం ఇచ్చినట్లు టాక్.

అయితే ఈ కొత్త ప్రాజెక్ట్ పై అఫిషియల్ గా ఇంకా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో వంశీ ఇంకా ఏ ప్రాజెక్ట్ ని ఫైనలైజ్ చేయలేదు. ఈ తరుణంలో విజయ్ నుండి వంశీ పైడిపల్లి కి ఈ ఆఫర్ రావడం జరిగింది. ఇక విజయ్ తదుపరి సినిమా కోసం త్వరలోనే స్క్రిప్ట్ ని రెడీ చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సారి మరి కాస్త జాగ్రత్త తీసుకొని అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని సినిమా తీస్తే బాగుంటుందని దళపతి ఫాన్స్ కోరుకుంటున్నారు. మరి ఈ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సెకండ్ సినిమా ఏ రేంజ్ లో హిట్ కొడ్తుందో చూడాలి.

 

 

Tags :