ASBL NSL Infratech

ఏపీ టెన్త్ టాపర్ మనకు నేర్పిస్తున్న పాఠమేంటి..?

ఏపీ టెన్త్ టాపర్ మనకు నేర్పిస్తున్న పాఠమేంటి..?

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. 86శాతంపైగా విద్యార్థులు పాస్ అయ్యారు. ఎప్పటిలాగే అబ్బాయిల కంటే అమ్మాయిలదే పైచేయి. ఈసారి కూడా అమ్మాయే స్టేట్ ఫస్ట్ గా నిలిచింది. ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వికి 600లకు 599లు మార్కులు వచ్చాయి. గతంలో ఎన్నడూ ఇన్ని మార్కులు ఎవరికీ రాలేదు. ఇదే ఇప్పటివరకూ రికార్డ్. హిందీలో తప్ప మిగిలిన అన్ని సబ్జెక్టుల్లో వందకు వంద మార్కులు సంపాదించింది మనస్వి.

అయితే టాపర్ మనస్వి నుంచి మనం కొన్ని విషయాలు చర్చించుకోవాల్సిన సందర్భం ఏర్పడింది. మనస్వి తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. అయినా మనస్వి మాత్రం గవర్నమెంటు స్కూల్లో చదవలేదు. నూజివీడులోని ఓ ప్రైవేటు స్కూల్లో మనస్వి చదివారు. టాపర్ గా నిలిచారు. తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులై ఉండీ వాళ్ల ఏకైక పుత్రికను ప్రైవేటు స్కూల్లో చదివించడం ఏంటని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అయితే తమ బిడ్డ బాగుపడాలని, ఉన్నత చదువులు చదివి పైకి రావాలని తల్లిదండ్రులెవరైనా కోరుకుంటారు. అందులో భాగంగానే వాళ్లు కూడా ప్రైవేటు స్కూల్లో మనస్విని చదివించి ఉండొచ్చు.

ప్రభుత్వ ఉపాధ్యాయులకే గవర్నమెంటు స్కూళ్లపై నమ్మకం లేనప్పుడు ఇక సామాన్యులకు ఎలా నమ్మకం కుదురుతుందని ఇప్పుడు చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలంటే మొదటి నుంచి చిన్న చూపే ఉంది. చాలా మంది ఉపాధ్యాయులు స్కూళ్లకు సరిగా వెళ్లరు. వెళ్లినా ప్రైవేటు ఉపాధ్యాయులు చూపించినట్లు శ్రద్ధ చూపరు. గవర్నరమెంట్ టీచర్ అంటేనే బిందాస్ జాబ్ అనే ఫీలింగ్ వచ్చేసింది. ఏ ఉద్యోగికీ లేనన్ని సెలవులు.. వెళ్లినా, వెళ్లకపోయినా అడిగేవాడుండడు. దీంతో టీచర్లు చాలా మంది లైట్ తీసుకుంటున్నారు. అలాంటి వాళ్ల వల్ల ప్రభుత్వ పాఠశాలలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది.

ఇటీవలికాలంలో ప్రభుత్వం నాడు నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలలను అత్యాధునికంగా తీర్చిదిద్దుతోంది. కాలానికి అనుగుణంగా స్కూళ్లను మారుస్తోంది. సంతోషమే.. అయితే టీచర్లు మారకుండా వసతులు కల్పించినంత మాత్రాన ప్రభుత్వ స్కూళ్లపై ఉన్న మచ్చ తొలగిపోదనేది చాలా మంది చెప్తున్న మాట. నిర్బంధం చేస్తే తప్ప పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు తీసుకురావడం అంత ఈజీ కాదు. ఈ నిబంధన మొదట ప్రభుత్వ ఉద్యోగుల నుంచే మొదలు కావాలి. అప్పుడే సామాన్యులకు కూడా నమ్మకం కలుగుతుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :