ASBL NSL Infratech

ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది

ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది

భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ యంత్రాంగంలోని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేకపోవడం అసంబద్ధమంటూ ఎలాన్‌ మస్క్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించగా, అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ ముఖ్య ఉప అధికారి ప్రతినిధి వేదాంత్‌ పటేల్‌ పై వ్యాఖ్యలు చేశారు. ఐరాసలో సంస్కరణలపై అధ్యక్షుడు బైడెన్‌ గతంలో సర్వ ప్రతినిధి సభలో మాట్లాడారు. విదేశాంగ మంత్రి కూడా అందుకు మద్దతిచ్చారు. భద్రతా మండలి సహా ఐరాస సంస్థల్లో సంస్కరణలకు మేం ఎప్పుడూ అనుకూలమే. ఐరాసలో ప్రాతినిధ్యం 21వ శతాబ్దపు ప్రపంచాన్ని ప్రతిబింబించేలా ఉండాలి అని వేదాంత్‌ పటేల్‌ పేర్కొన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :