ASBL NSL Infratech

తక్షణమే అమెరికా, చైనా మధ్య ... ప్రయాణాలపై నిషేధం

తక్షణమే అమెరికా, చైనా మధ్య ... ప్రయాణాలపై నిషేధం

చైనా లో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వ్యాప్తి నానాటికీ పెరుగుతుండటం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. కొత్త రకం ఇన్ఫెక్షన్‌ అమెరికా సహా పలు దేశాలను వణికిస్తోంది. దీంతో ఈ మిస్టరీ వ్యాధి పట్ల రిపబ్లికన్‌ సెనెటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే అమెరికా, చైనా మధ్య ప్రయాణాలపై నిషేధం విధించాలని కోరుతూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు లేఖ రాశారు. చైనాలో శ్వాసకోశ వ్యాధి వేగంగా వ్యాప్తిస్తోంది. ప్రజా ఆరోగ్య సంక్షోభంపై చైనా సర్కారు స్పష్టమైన సమాచారం బయటపెట్టదని మనకు తెలిసిందే. దీనిపై డబ్ల్యూహెచ్‌వో చర్యలు తీసుకునేదాకా మనం ఎదురుచూడకూడదు. అమెరికన్ల ఆరోగ్యం, మన ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు తక్షణమే ఇరు దేశాల మధ్య ప్రయాణాలపై నిషేధం విధించాలి. ఈ కొత్త వ్యాధి గురించి పూర్తిగా తెలిసేదాకా ఈ ఆంక్షలు కొనసాగాలి అని రిపబ్లికన్‌ సెనేటర్లు ఆ లేఖలో కోరారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :