నాకు వరుడిని వెతినందుకు నెటిజన్స్ కి థాంక్స్! వకీల్‌సాబ్ బ్యూటీ అనన్య నాగళ్ల

నాకు వరుడిని వెతినందుకు నెటిజన్స్ కి థాంక్స్! వకీల్‌సాబ్ బ్యూటీ అనన్య నాగళ్ల

షార్ట్ ఫిలిమ్స్‌తో కెరీర్ స్టార్ట్ చేసి.. 'మల్లేశం' సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది తెలుగమ్మాయి అనన్య నాగళ్ల . ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఆ తరువాత ప్లే బ్యాక్‌, వకీల్‌సాబ్‌, మ్యాస్ట్రో వంటి చిత్రాలతో ఆడియన్స్‌ను అలరించింది. ప్రస్తుతం నటిగా కెరీర్‌లో రాణించేందుకు కష్టపడుతోంది. అయితే ఈ భామ పెళ్లిపై రూమర్లు భారీగా వస్తున్నాయి. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందంటూ ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్‌కు చెందిన ఓ బడా ప్రొడ్యూసర్ రెండో కుమారుడితో ఈ అమ్మడికి లింక్ పెట్టేశారు నెటిజన్లు. ఈ ప్రచారంపై అనన్య స్పందించింది.

ఈ వార్తలపై వ్యగ్యంగా స్పందించింది నటి అనన్య నాగళ్ల. తన కోసం వరుడిని వెతికినందుకు ఈ బ్యూటీ థ్యాంక్స్ చెప్పింది. ప్రస్తుతం బ్యూటీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. 'నా కోసం పెళ్లి కొడుకును వెతికినందుకు థ్యాంక్స్. అయితే పెళ్లి కొడుకు ఎవరో నా కూడా చెప్పండి. అలాగే పెళ్లి డేట్, టైమ్ కూడా చెబితే.. నా పెళ్లికి నేను కూడా హాజరు కాగలను' అంటూ సెటైటికల్‌గా రాసుకొచ్చింది. తన పెళ్లి వస్తున్న వార్తలు అబద్దమంటూ ఈ పోస్ట్‌తో స్పష్టం చేసింది. నెటిజన్లు మాత్రం ఈ పోస్ట్‌పై భిన్నంగా స్పందిస్తున్నారు. '

నేనే పెళ్లి కొడుకుని అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కొంత మంది ప్లేస్.. డేట్ చెప్పి వచ్చేయ్ పెళ్లి చేసుకుందామని అనన్యకు కౌంటర్ ఇస్తున్నారు. అటు పలు సినిమాలతో బిజీ ఉన్న అనన్య.. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్‌గా ఉంటోంది. నెమ్మడిగా గ్లామర్ డోస్ పెంచేసి.. చిట్టి పొట్టి దుస్తుల్లో ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకుంటూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది నటి అనన్య నాగళ్ల.

https://twitter.com/AnanyaNagalla/status/1576435975240445952

 

praneet obili-garuda AHA poulomi Png-jewelry aurobindo MUPPA
Tags :