ASBL NSL Infratech

తాకా వారి శ్రీ సీతారామ కళ్యాణం

తాకా వారి శ్రీ సీతారామ కళ్యాణం

తెలుగు అలయెన్సెస్‌ ఆఫ్‌ కెనడా (తాకా) ఆధ్వర్యంలో 20 ఏప్రిల్‌ 2024 శనివారం రోజున టోరొంటోలోని శ్రీ శ్రీంగేరి విద్యా ఫీఠం దేవస్థానం ఆడిటోరియంలో దాదాపు  పన్నెండువందల మంది ప్రవాస తెలుగు వాసులు సకుటుంబ సపరివార సమేతంగా పాల్గొన్న  శ్రీరామ నవమి,  శ్రీ సీతారామ కల్యాణం ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కళ్యాణం ఉత్సవాలను ప్రముఖ పురోహితులు మంజునాథ్‌ ఆధ్వర్యంలో పది మంది వేద పండితులు, పురోహితులు శాస్త్రొక్తంగా జరిపించారు.

సాక్షాత్తు శ్రీరాముల వారు తానిషా ప్రభువు కు కనిపించి శ్రీరామదాసును చెరసాల నుండి విడిపించుటకై కప్పంగా కట్టిన అలనాటి మాడలకు సరిjైున వెండి నాణాలు మరియు దేవస్థానం వారి లడ్డూలు భద్రాచలం నుండి తెప్పించి కళ్యాణం చేయించుకున్న భక్తులకి తాంబూలంతో పాటు ఇవ్వ డం  ప్రత్యేకంగా నిలవగా, హాజరైన వారందరూ తాకా కమిటీ సభ్యులను అభినందించారు.

ఈ  కళ్యాణోత్సవాలలో  అధ్యక్షులు శ్రీ రమేశ్‌ మునుకుంట్ల, ఉపాధ్యక్షులు శ్రీ రాఘవ్‌ అల్లం, జనరల్‌ సెక్రెటరి శ్రీ ప్రసన్న కుమార్‌ తిరుచిరాపల్లి, కోషాదికారి శ్రీ మల్లిఖార్జునా చారి పదిర, సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి అనిత సజ్జ, డైరక్టర్లు కుమారి విద్య భవణం,  ఖజిల్‌ మొహమ్మద్‌, దుర్గా ఆదిత్యవర్మ భూపతిరాజు,  యూత్‌ డైరక్టరు శ్రీమతి లిఖిత యార్లగడ్డ, ఎక్స్‌ అఫిసియో సభ్యురాలు శ్రీమరి కల్పన మోటూరి, ఫౌండెషన్‌ కమీటీ చైర్మన్‌ శ్రీ అరుణ్‌ కుమార్‌ లాయం, ట్రస్టీబోర్డు చైర్మన్‌ శ్రీ సురేశ్‌ కూన, ట్రస్టీలు శ్రీమతి శృతి ఏలూరి, శ్రీమతి వాణి జయంతి, శ్రీ పవన్‌ బాసని మరియు ఫౌండర్లు శ్రీ హనుమంతాచారి సామంతపుడి, శ్రీనాథ్‌ కుందూరి, మునాఫ్‌ అబ్దుల్‌ గారలు పాల్గొన్నారు.  
 

 

Click here Photogallery

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :