ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కేశినేని నానికి టీడీపీ షాక్...?

కేశినేని నానికి టీడీపీ షాక్...?

విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి షాక్ ఇస్తూ టీడీపీ అధిష్టానం బెజవాడ ఎంపీ టిక్కెట్ ను వేరే వారికి కేటాయించింది. ఈ విషయాన్ని స్వయంగా ఎంపీ నానియే తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు నాని. చంద్రబాబుకు తాను వెన్నుపోటు పొడవలేదని.. అలా చేసుంటే ఇంకా మంచి పదవిలో ఉండే వాడిని అన్నారు. 'నన్ను వద్దని చంద్రబాబు అనుకున్నారు. నేను మాత్రం అనుకోలేదు. చంద్రబాబుతో రోజూ ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటాను. ఇదివరకూ నామినేషన్ల చివరి వరకూ అభ్యర్థులను తేల్చేవారు కాదు. కానీ, నా విషయంలోనే చంద్రబాబు ఇలా నిర్ణయం తీసుకున్నారు. ఇండిపెండెంట్ గా పోటీలో నిలిచినా గెలుస్తానని గతంలోనే చెప్పా. నేనేం చేయాలో కాలమే నిర్ణయిస్తుంది. నేను పార్టీలో కొనసాగడంపై అభిమానులు నిర్ణయిస్తారు. ఫిబ్రవరి మొదటి వారంలో నా నిర్ణయం ప్రకటిస్తాను. ప్రస్తుతానికి నా బాస్ చంద్రబాబు. ఆయన చెప్పినట్లే వింటాను.' అని కేశినేని నాని స్పష్టం చేశారు.

తిరువూరు సభ బాధ్యతను పార్టీ కేశినేని చిన్నికి ఇచ్చిన తర్వాత అక్కడ సభా ఏర్పాట్లపై కేశినేని చిన్న ఏర్పాటు చేసిన సమావేశానికి నాని వెళ్లారు. అక్కడి విషయాలు పరిధి దాటిపోయాయి. దీంతో ఏదో ఒకటి తేల్చకపోతే ఇలాంటి సమస్యలు పెరిగిపోతాయన్న ఉద్దేశంతో వెంటనే టీడీపీ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. అంతేకాదు.. తిరువూరు సభకు హాజరుకావొద్దని కూడా ఆయనకు వర్తమానం అందింది. దీంతో తాను తిరువూరు సభకు హాజరుకానని.. తానొస్తే అక్కడి పరిస్థితులు చేయిదాటిపోతాయని కామెంట్ చేశారు కేశినేని నాని.

విజయవాడ ఎంపీ అభ్యర్థిత్వానికి సంబంధించి ముందుగానే కేశినేని నానికి.. హైకమాండ్ పూర్తిగా క్లారిటీ ఇచ్చేసింది.దీంతో విజయవాడ ఎంపీ సీటు రేసులో ఉన్న సోదరుడు కేశినేని చిన్నికి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో చిన్ని.. పార్టీ తరపున కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్తున్నారు. అంతేకాదు.. సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. హైకమాండ్ ముఖ్యంగా లోకేష్ తో సఖ్యంగా ఉంటూ.. ఆయన ఆదేశాలను అమలు చేస్తూ, పార్టీలో కీలకంగా మారారు. ఈ పరిణామాలతో వచ్చే ఎన్నికల్లో బెజవాడ ఎంపీ సీటుకు కేశినేని చిన్ని పోటీ చేయనున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.

మరి ఇలాంటి సమయంలో కేశినేని నాని ఏం చేయనున్నారు..? ఫిబ్రవరిలో తన కార్యాచరణ ప్రకటిస్తారా..? పార్టీలోనే ఉంటారా..? వేరే పార్టీ చూసుకుంటారా..? సోదరుడు గెలవకుండా అడ్డుకోగలుగుతారా...? హైకమాండ్ తో నాని విభేదాలు.. వైసీపీకి కలసివస్తాయా..? కేశినేని నాని ఇష్యూ వెనక వైసీపీ నేతల హస్తముందా...?ఇటీవలి కాలంలో వైసీపీ నేతలతో కలిసి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు హాజరైన కేశినేని ప్రస్థానం ఎలా సాగనుంది..? ఇప్పుడు నాని అనుచరులు, అభిమానుల్లో ఇదే అంశంపై ఆసక్తి నెలకొంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :