ASBL NSL Infratech

కంగువ‌తో టార్గెట్ సెట్ చేసుకున్న సూర్య‌

కంగువ‌తో టార్గెట్ సెట్ చేసుకున్న సూర్య‌

గ‌త కొంత‌కాలంగా ప్ర‌యోగాత్మ‌క సినిమాలు చేస్తూ ఆడియ‌న్స్ ను ఎంట‌ర్టైన్ చేస్తున్న‌త‌మిళ స్టార్ హీరో సూర్య‌, ప్ర‌స్తుతం కంగువ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. శివ ద‌ర్శ‌క‌త్వంలో సూర్య హీరోగా చేస్తున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్, యువి క్రియేష‌న్స్ క‌లిసి నిర్మిస్తున్నాయి. కంగువను పీరియాడిక‌ల్ మూవీగా ఫిక్ష‌న‌ల్ స్టోరీగా రాబోతుంది.

ఇప్ప‌టికే రిలీజైన పోస్ట‌ర్లు సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి. ఈ సంవ‌త్స‌రం రాబోతున్న మోస్ట్ అవెయిటెడ్ సినిమాల్లో కంగువ కూడా ఉంది. కానీ కంగువ పై అనుకున్నంత బ‌జ్ మాత్రం లేదు. ఇప్ప‌టికే కంగువ నుంచి గ్లింప్స్ రాగా త్వ‌ర‌లోనే ఈ సినిమా నుంచి టీజ‌ర్ ను రిలీజ్ చేయ‌నున్నార‌ట మేక‌ర్స్. ఈ టీజ‌ర్ తోనే సినిమాపై ఉన్న అంచ‌నాలను డ‌బుల్ చేయాల‌ని చూస్తున్నార‌ట మేక‌ర్స్.

అంద‌రూ ఇప్ప‌టివ‌ర‌కు కంగువ‌ని లైట్ తీసుకుంటున్నారు కానీ టీజ‌ర్ వ‌చ్చాక ఆ అంచ‌నాల‌న్నీ మారిపోతాయంటున్నారు. దానిక్కార‌ణం సూర్య కావాల‌ని మ‌రీ ఈ సినిమాను ఎంచుకుని చేయ‌డ‌మే. ఈ సినిమాతో సూర్య చాలా పెద్ద టార్గెటే పెట్టుకున్న‌ట్లు తెలుస్తోంది. సూర్య కంగువ సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే అంతా కూడా ఆడియ‌న్స్ కు ఒక కొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియ‌న్స్ ను ఇస్తాయంటున్నారు. అంతేకాదు సినిమాలో సూర్య న‌ట విశ్వ‌రూపం కూడా చూస్తార‌ని ఆడియ‌న్స్ అంటున్నారు. దేవీ శ్రీ సంగీతం కూడా సినిమాకు హైలైట్ గా నిలవ‌నుంద‌ని అంటున్నారు. కంగువ రిలీజ్ డేట్ విష‌యంలో క్లారిటీ రావాల్సి ఉంది.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :