ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఇంకెంతమందిని జైళ్లలో పెడతారు..?: ప్రభుత్వంపై సుప్రీం సీరియస్

ఇంకెంతమందిని జైళ్లలో పెడతారు..?: ప్రభుత్వంపై సుప్రీం సీరియస్

తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విమర్శలు చేస్తే జైల్లో పెట్టడం ఏంటని, ఇలా అయితే ఎన్నికలు పూర్తయ్యే సమయానికి ఇంకెంతమందిని అరెస్ట్ చేస్తారని స్టాలిన్ సర్కార్‌ను నిలదీసింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై విమర్శలు చేశాడనే ఆరోపణల నేపథ్యంలో అరెస్టైన ఓ యూట్యూబర్‌‌కు బెయిల్‌ పునరుద్ధరించే క్రమంలో అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేసే ప్రతి ఒక్కరినీ జైలుకు పంపడం సరికాదని చీవాట్లు పెట్టింది.

వివరాల్లోకి వెళితే.. సీఎం స్టాలిన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ తమిళనాడుకు చెందిన దురై మురుగన్‌ (సత్తై) అనే యూట్యూబర్‌ను 2021 అక్టోబరులో పోలీసులు అరెస్టు చేశారు. అదే ఏడాది నవంబర్‌లో అతడికి మద్రాస్ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయగా.. 2022లో మద్రాసు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ రద్దు చేసింది. న్యాయస్థానం ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేశాడని, అందుకు అతడి బెయిల్ రద్దు చేస్తున్నామని డివిజన్ బెంచ్ తమ తీర్పులో పేర్కొంది. మద్రాస్ బెంచ్ తీర్పును మురుగన్‌ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. అత్యున్నత ధర్మాసనం అతడికి మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

రెండున్నరేళ్లుగా బెయిల్‌పై ఉన్న మురుగన్‌.. బెయిల్‌ గడువు ముగియడంతో పునరుద్ధరణ కోసం మళ్లీ సుప్రీం కోర్టు తలుపుతట్టాడు. జస్టిస్ అభ‌య్ ఎస్ ఓకా, జ‌స్టిస్ ఉజ్వ‌ల్ భుయాన్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపి అతడి బెయిల్‌ను పునరుద్ధరిస్తున్నట్లు తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘యూట్యూబ్‌లో విమర్శలు చేసిన ప్రతి ఒక్కరినీ అరెస్టు చేసుకుంటూ పోతే.. ఎన్నికల ముందు ఎంతమందిని జైల్లో పెడతారు? కోర్టు ఇచ్చిన స్వేచ్ఛను మురుగన్ దుర్వినియోగం చేసినట్లు ఎలాంటి సాక్ష్యాలు కనిపించడం లేదు. అందువల్ల అతడి రెగ్యులర్‌ బెయిల్‌ను పునరుద్ధరిస్తున్నాం’ అంటూ తీర్పు వెలువరించింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :