ASBL NSL Infratech

వరల్డ్ స్మార్ట్ సిటీల జాబితాలో.. హైదరాబాద్ కు స్థానం

వరల్డ్ స్మార్ట్ సిటీల జాబితాలో.. హైదరాబాద్ కు స్థానం

వరల్డ్‌ స్మార్ట్‌ సిటీల జాబితాలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు స్థానం దక్కింది. దేశంలో ఉన్న ప్రధాన నగరాలు ఢిల్లీ, ముంబై,  బెంగళూరు తర్వాతి స్థానంలో హైదరాబాద్‌ నిలిచింది. అయితే,  ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ సిటీలపై నిర్వహించిన సర్వేలో నాలుగు భారతీయ స్మార్ట్‌ సిటీలు జాబితాలో చేరాయి. అందులో దేశ రాజధాని ఢిల్లీ మహానగరం అగ్రస్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా గత ఏడాదితో పోలిస్తే ఒక స్థానం దిగజారి 106వ స్థానంలో నిలిచింది. రెండో టాప్‌ ఇండియన్‌ స్మార్ట్‌ సిటీ ముంబై. గత ఏడాదితో పోలిస్తే రెండు స్థానాలు ఎగబాకి ప్రపంచ జాబితాలో 107వ స్థానంలో నిలిచింది. భారత్‌లో స్మార్ట్‌ సిటీల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న హైదరాబాద్‌ గత  ఏడాదితో పోలిస్తే 5 స్థానాలు ఎగబాకి ప్రపంచ వ్యాప్తంగా 111వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది మొత్తం 142 నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :