ASBL NSL Infratech

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

అమెరికాలోని వాషింగ్టన్‌ రాష్ట్రం ఆర్చర్డ్స్‌లోని ఓ ఇంట్లో చోటుచేసుకున్న కాల్పుల్లో అనుమానిత షూటర్‌ సహా అయిదుగురు చనిపోయారు. మృతుల కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి ఫోన్‌కు ఓ అపరిచితుడి నుంచి మెసేజీ అందింది. అతడి  కుటుంబసభ్యులకు హాని తలపెట్టినట్లు దాని సారాంశం. దీంతో ఆయన వెంటనే పోలీసులకు సమాచారం  అందించారు. కాల్పులు జరిగిన ఇంట్లో సాయుధులెవరైనా ఉండి ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు డ్రోన్‌ను పంపించి పరిశీలించగా అయిదు మృతదేహాలు కనిపించాయి. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకున్నారు.  ఓ వ్యక్తి ఇంట్లోని నలుగురిని కాల్చి చంపి, అనంతరం కాల్చుకుని చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :