ASBL NSL Infratech

జగన్ ఇచ్చిన అప్పు పై స్పందించిన షర్మిల..

జగన్ ఇచ్చిన అప్పు పై స్పందించిన షర్మిల..

కడప ఎంపీగా నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో తన ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలను షర్మిల వెల్లడించారు. అయితే ఈ విషయం మీరు తెలుగు రాష్ట్రాలలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆమె సబ్మిట్ చేసిన అఫిడివిటీలో 82 కోట్ల వరకు అప్పు ఉన్నట్టు పేర్కొన్నారు. పైగా ఆ అప్పు ఇచ్చింది కూడా స్వయంగా ఆమె అన్న జగన్, వదిన భారతి. దీంతో వారి దగ్గర డబ్బులు తీసుకొని వారిపైనే షర్మిల నిందలు మోపుతోంది అంటూ కొందరు విమర్శించారు. అయితే ఈ విషయంపై తాజాగా స్పందించిన షర్మిల కుటుంబ ఆస్తిలో వాటా పొందే హక్కు ఆడబిడ్డకి కూడా ఉంటుంది అని అంతేకాదు కొంతమంది చెల్లెళ్లకు ఎంతో కొంత ఇచ్చి అది కూడా అప్పు ఇచ్చినట్లు చూపిస్తారు అని విమర్శించారు. అంటే అన్యాపదేశంగా.. తనకు తండ్రి ఆస్తిలో రావలసిన వాటని జగన్ అప్పుగా ఇచ్చినట్లు షర్మిల పేర్కొన్నారు. అయితే అవసరానికి తీసుకొని.. తీరా ఇప్పుడు అన్నపై అలా విరుచుకు పడడం షర్మిలకు తలదు అని హితవు పలికే వారు కూడా ఉన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :