ASBL NSL Infratech

మూడేళ్ల అమెరికా బాలుడికి ... సుప్రీంకోర్టు సాయం

మూడేళ్ల అమెరికా బాలుడికి ... సుప్రీంకోర్టు సాయం

తీవ్రమైన కాలేయ సమస్యతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ మూడేళ్ల  అమెరికా బాలుడి విషయంలో సుప్రీంకోర్టు మానవతా దృక్పథంతో ఆదేశాలిచ్చింది. నిబంధనలను కాస్త పక్కన పెట్టి బాలుడికి దూరపు బంధువైన భారతీయ యువకుడి నుంచి కాలేయం స్వీకరించడానికి అనుమతినిచ్చింది. ఈ కేసును భవిష్యత్తులో వచ్చే అవయవదానాల పిటిషన్ల విచారణలో ప్రాతిపదికగా పరిగణించబోమని స్పష్టం చేసింది. ఈ కేసులో బాధిత బాలుడు డీకంపోజ్డ్‌ బైలియరీ సిరోసిస్‌ (డీబీసీ) అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ సమస్య ఉన్న వారు కాలేయం మార్పిడి చేయించుకుంటే తప్ప జీవించే అవకాశం ఉండదు. ఈ క్రమంలో కాలేయం ఇవ్వడానికి అతడి దూరపు బంధువైన ఓ యువకుడు ముందుకు వచ్చినప్పటికీ నిబంధనలు అడ్డుగా నిలిచాయి. బాధితులు విదేశీయులు అయి ఉంటే, వారి దూరపు బంధువుల నుంచి అవయవాలను స్వీకరించకూడదు. అయితే ఈ కేసులో అవయవదానానికి బాలుడి తల్లిదండ్రులను అనర్హులుగా వైద్యులు గుర్తించడాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. కేసులో ఉన్న సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అవయవ దానానికి అనుమతి ఇస్తున్నామని ఆదేశాలు జారీ చేసింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :