ASBL NSL Infratech

అమెరికాలో యంగ్ ప్రొఫెషనల్ అవార్డు అందుకున్న శరత్ చంద్రారెడ్డి

అమెరికాలో యంగ్ ప్రొఫెషనల్ అవార్డు అందుకున్న శరత్ చంద్రారెడ్డి

అమెరికాలోని నిర్మాణ రంగంలో విశేష ప్రతిభ చాటిన మెదక్‌ జిల్లా వాసి శరత్‌ చంద్రారెడ్డికి యంగ్‌ ప్రొఫెషనల్‌ అవార్డు దక్కింది. శరత్‌చంద్రారెడ్డి చిన్నశంకరం పేట మండలం దరిపల్లి గ్రామానికి చెందినవారు. అమెరికా వాషింగ్టన్‌ డీసీలో కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ అమెరికా (సీఎంఏఏ) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పారిశ్రామికవేత్తల సమక్షంలో ఆయన అవార్డు అందుకొన్నారు. ప్రస్తుతం శరత్‌చంద్రారెడ్డి కన్‌స్ట్రక్షన్‌ ప్రాజెక్టు మేనేజర్‌ హోదాలో ఉన్నారు. ఇతను హూస్టన్‌తో పాటు అనేక నగరాల్లో డైనేజీలు, హైవేలు, పార్కులు, వాటర్‌, వేస్ట్‌ వాటర్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి సారథ్యం వహించారు. ఈ అవార్డు రావడానికి మద్దతుగా నిలిచిన అర్దూర గ్రూప్‌ సభ్యులకు, కుటుంబీకులకు, మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :