ASBL NSL Infratech

మరో కొత్త వ్యాపారంలోకి రిలయన్స్

మరో కొత్త వ్యాపారంలోకి రిలయన్స్

ముఖేష్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ తాజాగా మరో కొత్త వ్యాపారంలోకి అడుగు పెడుతోంది. గతంలో ఎన్నడూ చూడని వేగంతో ఇటీవల కాలంలో రిలయన్స్‌ గ్ర్రూప్‌ అనేక కొత్త వ్యాపారాల్లోకి శరవేగంగా విస్తరిస్తోంది. తాజాగా రిలయన్స్‌ బ్రిటిష్‌ కాఫీ షాప్‌ ప్రెట్‌ ఎ మ్యాంగర్‌ను దేశానికి తీసుకురావడం ద్వారా టాటాతో పోటీకి సౌ అంటోంది. దీనికి సంబధించి బ్రిటీష్‌ శాండ్‌విచ్‌ అండ్‌ కాఫీ చైన్‌ ప్రెట్‌ ఎ మాంగర్‌ తో రిలయన్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది. రిలయన్స్‌ బ్రిటిష్‌ కాఫీ భాగస్వామ్యంలో ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో మేకర్‌ మ్యాక్సిటీలో ప్రీట్‌ మ్యాంగర్‌ తన తొలి అవుట్‌లెట్‌ ప్రారంభమైంది. ప్రెట్‌ ఎ మేంగర్‌ షాప్‌ ప్రారంభోత్సవంలో బాలీవుడ్‌ నటి సారా అలీఖాన్‌ పాల్గొన్నారు. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :